RCB కెప్టెన్సీని కూడా విరాట్ కోహ్లీ వదులుకోనున్నాడా? ఆడిందే 8 మ్యాచ్‌లు వర్క్ లోడ్ ఎలా?

IPL 2021: Will Kohli Step Down As RCB Captain ? కెప్టెన్సీ వల్లే ఒత్తిడి.. వదులుకోనున్నాడా?

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతలను వదులుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. పని భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని, వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని గురువారం సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు. సన్నిహిత వర్గాలతో పాటు లీడర్‌షిప్ గ్రూప్‌లో కీలకమైన రోహిత్ శర్మ, రవిశాస్త్రితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు ఐపీఎల్​ కెప్టెన్సీ మాటేంటని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల కన్నా ఐపీఎల్ సారథ్యం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుందని గుర్తు చేస్తున్నారు.

8 మ్యాచ్‌లకే ఒత్తిడా?

8 మ్యాచ్‌లకే ఒత్తిడా?

తాజాగా ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లీ నుంచి వచ్చిన ప్రకటన ఎలాంటిదో అర్థం కావడం లేదు. ఈ నిర్ణయం వల్ల పనిభారం తగ్గిందని అనుకుంటున్నాడా? కరోనా కారణంగా డిసెంబర్ 2020 నుంచి ఇప్పటివరకు టీమింయా 8 టీ20లు మాత్రమే ఆడింది. వీటికంటే ఐపీఎల్​ మ్యాచ్‌లే ఎక్కువగా జరిగి ఉండొచ్చు.

ఐపీఎల్​ కెప్టెన్సీ కూడా చిన్న విషయమేమీ కాదు. టోర్నీని క్షుణ్ణంగా గమనిస్తే అది మీకే అర్థమవుతుంది. మ్యాచ్​లు, టైటిల్​ గెలవాలన్న ఫ్రాంచైజీల ఒత్తిడి కూడా విపరీతంగా ఉంటుంది. మరి ఆర్‌సీబీ కెప్టెన్సీని కూడా కోహ్లీ వదిలేస్తాడా? మూడు ఫార్మాట్ల (వన్డే, టెస్టు, ఐపీఎల్)కూ ఇంకా అతను సారథ్యం వహిస్తున్నందున ఇప్పటికీ పని భారం తగ్గలేదనే భావిస్తున్నా.'అని సదరు అధికారి ఏఎన్‌ఐతో అన్నాడు.

ఆర్‌సీబీ కెప్టెన్‌గా..

ఆర్‌సీబీ కెప్టెన్‌గా..

ఆర్‌సీబీ కెప్టెన్​గా.. విరాట్ కోహ్లీకి చెత్త రికార్డే ఉంది. 2013లో ఈ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న విరాట్.. ఇప్పటివరకు జట్టుకు ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడు. 2016 సీజన్‌లో అద్వితీయమైన ఆటతో జట్టును ఒక్కసారి మాత్రమే ఫైనల్​కు చేర్చగలిగాడు. ఆ తర్వాత మళ్లీ గత సీజన్​లో ప్లే ఆఫ్స్ వరకూ చేరుకోగలిగినా..టైటిల్ ఫైట్‌కు మాత్రం తీసుకోలేకపోయాడు. 2017, 2019లో అయితే ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2018లో మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

టైటిల్ గెలవకుంటే..

టైటిల్ గెలవకుంటే..

ఐపీఎల్ 2021 సీజన్​ ఫస్టాప్‌లో దుమ్మురేపిన ఆర్‌సీబీ.. టైటిల్ ఆశలు రేకెత్తిస్తుంది. ఫస్టాఫ్‌లో 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలందుకున్న ఆజట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే సెకండాఫ్‌లో ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో నెగ్గినా ప్లేఆఫ్‌ చేరొచ్చు. దీంతో ఈసారైనా ఫ్రాంచైజీ టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకేవేళ ఈ సీజన్​లోనూ ఆర్‌సీబీ ఫైనల్​కు చేరడంలో విఫలమైతే.. ఐపీఎల్ కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్​బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ టైటిల్ సాధిస్తే మాత్రం మెగాటోర్నీ ముందు అతని ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుందంటున్నారు.

తప్పించారా? తప్పుకున్నాడా?

తప్పించారా? తప్పుకున్నాడా?

టీ20 ప్రపంచకప్ ఫలితంపై కోహ్లీ కెప్టెన్సీ భవితవ్యం ఆధారపడి ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. టోర్నీలో విజయం సాధిస్తే అతని కెప్టెన్సీ హోదాకు ఎలాంటి డోకా ఉండదు. కానీ విఫలమైతే మాత్రం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బీసీసీఐ కూడా కోహ్లీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నానని ముందుగానే చెప్పి గౌరవం కాపాడుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల భారత క్రికెట్‌లో నెలకొన్న పరిణామాలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 17, 2021, 18:21 [IST]
Other articles published on Sep 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X