IPL 2021 Playoffs: రోహిత్ సేన తలరాతను డిసైడ్ చేయనున్న పింక్ టీమ్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎపిసోడ్.. రసవత్తరంగా మారింది. ప్లేఆఫ్స్ సమీపించే సరికి- జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంటోంది. ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టడానికి అవకాశం ఉన్న టీమ్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ పోరు కాస్త ఐపీఎల్ 2021 టోర్నమెంట్‌ను ఉత్కంఠ భరితంగా మార్చివేశాయి. ప్లేఆఫ్స్‌లో ఎంట్రీ ఇవ్వాలంటే.. నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించబోతోంది.

రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపుతో..
మంగళవారం రాత్రి షార్జా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయాన్ని సాధించింది ముంబై ఇండియన్స్. తిరుగులేని గెలుపు అది. ప్లేఆఫ్ ముంగిట కొట్టుమిట్టాడుతోన్న ముంబై ఇండియన్స్‌కు ఊపిరి పోసిన విజయం అది. రాజస్థాన్ రాయల్స్‌పై భారీ తేడాతో రోహిత్ సేన విజయం సాధించడంతో ప్లేఆఫ్స్ ఛాన్స్‌ను సజీవంగా నిలుపుకోగలిగిందా టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను 90 పరుగులకే కట్టడి చేయడం, ఆ తరువాత లక్ష్యాన్ని 8.2 ఓవర్లలోనే ఛేదించడంతో ముంబై ఇండియన్స్ నెట్ రన్‌రేట్ మెరుగుపడింది.

ఫిఫ్త్ స్పాట్‌కు
ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ తన పాయింట్లను పెంచుకోగలిగింది. నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోగలిగింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది రోహిత్ సేన మొత్తం 13 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇంకో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ఈ ఐపీఎల్‌లో లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఈ నెల 8వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ప్రారంభమౌతుంది.

ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే..
ప్రస్తుతం ముంబై ఇండియన్స్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య ప్లేఆఫ్స్ టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. ఈ రెండు జట్లు కూడా 12 పాయింట్లతో సమానంగా నిలిచాయి. నెట్ రన్‌రేట్ విషయంలో మాత్రం నైట్ రైడర్స్.. ముంబై కంటే చాలా మెరుగ్గా ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో ముంబై గెలవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు చేరుతాయి. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. రాజస్థాన్ చేతిలో గనక ఓడిపోతే- 12 పాయింట్ల వద్దే నిలిచిపోతుంది నైట్‌రైడర్స్.

రాజస్థాన్‌పై కోల్‌కత నెగ్గితే..
దీనికి భిన్నంగా ఏ మాత్రం రిజల్ట్ వచ్చినా.. ముంబై ఇండియన్స్ కథ లీగ్ దశలోనే క్లోజ్ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్‌పై నైట్ రైడర్స్ నెగ్గితే.. 14 పాయింట్లతో పాటు.. మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా ప్లేఆఫ్స్‌లో అడుగు పెడుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిందనే అనుకుందాం. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్.. నైట్ రైడర్స్‌పై విజయం సాధించితే.. అప్పుడు కథ మరింత రసవత్తరంగా మారుతుంది.

12 పాయింట్లతో
రాజస్థాన్ రాయల్స్.. నైట్ రైడర్స్‌పై గెలివడం, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడమంటూ జరిగితే.. ఈ మూడు జట్లు కూడా 12 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఆ పరిస్థితిలోనూ నైట్ రైడర్స్.. ముందంజ వేస్తుంది. ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెడుతుంది. దీనికి కారణం.. మెరుగైన రన్‌రేట్ ఉండటమే. ఇక ఎవరు ఎవరి మీద గెలుస్తారు? ఎవరు ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇస్తారనేది ఈ మెగా ఈవెంట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చివేసింది. ఎటొచ్చీ- రోహిత్ సేన భవిష్యత్ ఏమిటనేది రాజస్థాన్ రాయల్స్ డిసైడ్ చేయాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications