షాకింగ్: ఐపీఎల్ లోగో వెనుక ఉన్న సీక్రెట్‌ను బయటపెట్టిన సెహ్వాగ్: ఆయన కోసమేనంటూ

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ తొలి మ్యాచ్.. క్రికెట్ ప్రేమికుల అంచనాలకు అనుగుణంగా సాగింది. ఫైనల్ బాల్ విక్టరీ.. ఈ లో-స్కోర్ మ్యాచ్‌లో హైలైట్. క్రికెట్ ఆరాధకులకు కావాల్సింది కూడా అదే. తక్కువ స్కోర్ నమోదైనప్పటికీ.. మ్యాచ్ చిట్టచివరి బంతి వరకూ సాగడం తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. కోట్లాదిమంది రెండు జట్ల అభిమానులను టెన్షన్ పెట్టంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్టలోనూ బౌలర్లదే ఆధిపత్యం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టల్లో బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు.
ఏబీ ఒక్కడి వల్లే..
అయినప్పటికీ- ఏబీ డివిలియర్స్ రెచ్చిపోయి ఆడాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో అంతే సమర్థవంతంగా రాణించగలడని మరోసారి ప్రూవ్ అయింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి ఒకవంక వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ- ఏబీ డివిలియర్స్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారినప్పటికీ.. లెక్క చేయలేదు. ముంబై విజయం సాధించడానికి ఏబీ డీ అడ్డుగా నిలిచాడు. ఒంటి చేత్లో మ్యాచ్‌ను గెలిపించాడు. చివరి ఓవర్‌లో అతను అవుట్ అయినప్పటికీ.. అప్పటికే జట్టును విజయం వాకిట్లో నిలిపాడు. మిడిలార్డర్‌లో ఏబీ లేకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఏబీ క్రీజ్‌లో పాతుకుని పోవడం.. తనదైన శైలిలో దూకుడుగా ఆడటం ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
బ్యాటింగ్ అద్భుతం..
ప్రతికూల పరిస్థితుల్లో ఏబీ డివిలియర్స్ రాణించిన తీరు పట్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు అతణ్ని ఆకాశానికెత్తేస్తున్నారు. అసలు సిసలు ఛాంపియన్ అంటూ అభివర్ణిస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా దీనికి అతీతుడేమీ కాదు. వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఏబీ డీ బ్యాటింగ్ శైలి- అద్భుతమంటూ కితాబిచ్చాడు. అతను ఆడిన క్రికెటింగ్ షాట్లు.. మరే ఇతర బ్యాట్స్‌మెన్‌కు కూడా సాధ్యం కావని పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్ షాట్ ఒకదాన్ని ఐపీఎల్ లోగోతో పోల్చాడు. ఏబీ షాట్లను చూసే ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఈ లోగోను డిజైన్ చేసిందంటూ ట్వీట్ చేశాడు.
27 బంతుల్లో..
చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏబీ చివరికంటా నిలిచాడు. ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. 27 బంతుల్లో రెండు సిక్సర్లు నాలుగు ఫోర్లతో 48 పరుగులు చేశాడు. చివరి ఓవర్ నాలుగో బంతికి రనౌట్ అయ్యాడు. అప్పటికే జట్టు విజయం వాకిట్లో నిలిచింది. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన దశలో హర్షల్ పటేల్ విన్నింగ్ షాట్ ఆడాడు. ముంబై బౌలర్లు జస్‌ప్రీతు బుమ్రా, మార్కో జెన్‌సెన్, కృనాల్ పాండ్య ధాటికి మిడిలార్డర్ కుప్పకూలిపోయినప్పటికీ- మరో ఎండ్‌లో ఏబీ డివిలియర్స్ పాతుకుని పోయాడు. చివరివరకంటా నిలిచి జట్టును గెలిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications