న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ సిగ్నల్‌కు అర్థమేంటో తెలుసా: షేక్ చేస్తోన్న సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్

IPL 2021: Throwing a tweet for Jaddu, sure he will catch it, CSK appreciates
IPL 2021 : Ravindra Jadeja’s Unique Celebration Goes Viral After CSK Win Against RR| Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు గాడిన పడినట్టే. తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినప్పటికీ- పరాజయం నుంచి తప్పించుకోలేకపోయిందా జట్టు. మళ్లీ గత సీజన్ నాటి వరుస ఓటములు వెంటాడవచ్చనే కంగారు అభిమానుల్లో కనిపించింది. అదే మ్యాచ్‌లో ధోనీ డకౌట్ కావడం, 12 లక్షల రూపాయల జరిమానా అతని తలపై పడటం వంటివన్నీ అపశకునాలుగా భావించారు. మరో మ్యాచ్‌లో ఓడిపోతే.. ఇక కోలుకోలేదనీ అంచనా వేసుకున్నారు. అవన్నీ తేలిపోయాయి. సూపర్ కింగ్స్ మళ్లీ పట్టాలెక్కింది.

తొలి మ్యాచ్ తరువాత ఆడిన రెండింట్లోనూ ఆల్‌రౌండర్ ప్రతిభను కనపరిచింది. తాను ఎదుర్కొన్న రెండో మ్యాచ్‌లో- బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును 106 పరుగులకే కట్టడి చేసిందంటే చెన్నై బౌలింగ్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ముంబైలోని వాంఖెడె స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. మరోసారి సత్తా చాటింది. రాజస్థాన్‌ను ఓ ఆట ఆడించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్‌ను 143 పరుగల వద్దే కట్టడి చేసింది.

ఈ మ్యాచ్‌లో సర్ రవీంద్ర జడేజా.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. ఆ లోటును ఆన్‌ఫీల్డ్‌లో తీర్చాడు. తోటి స్పిన్నర్ మొయిన్ అలీతో కలిసి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు అయిదు వికెట్లను పంచుకున్నారు. ఇందులో రవీంద్ర జడేజా వాటా రెండు వికెట్లు. ఓపెనర్ జోస్ బట్లర్, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శివమ్ దుబేలను పెవిలియన్ దారి పట్టించాడు. అక్కడితో ఆగలేదతను. ఫీల్డింగ్‌లో ఏకంగా నాలుగు క్యాచ్‌లను పట్టాడు. మరో ఓపెనర్ మనన్ వోహ్రా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కత్‌లను తన క్యాచ్‌లతో అవుట్ చేశాడు.

శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌గా అందుకున్న తరువాత.. రవీంద్ర జడేజా బాడీ లాంగ్వేజ్ అభిమానులను ఆకట్టుకుంది. నాలుగు క్యాచ్‌లు పట్టుకున్నట్టు సంకేతాలను ఇస్తూ స్టెప్పులు వేశాడు. అరచేతిని సెల్‌ఫోన్‌లాగా చెవుల వద్ద పెట్టి జడేజా వేసిన స్టెప్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్పింగులు, ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జయదేవ్ ఉనద్కత్ వికెట్‌ పడేటప్పటికే రాజస్థాన్ రాయల్స్ పరాజయం ఖరారైంది. ఆ జోష్ అతనిలో కనిపించింది. 143 పరుగుల వద్ద అతను తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు.

రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్లు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. సర్ అనే బిరుదుకు అతను అర్హుడేనంటూ చెబుతున్నారు. ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ మైకెల్ వాగన్, ఇర్ఫాన్ పఠాన్, హేమంగ్ బదాని, స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే, ప్రజ్ఙాన్ ఓఝా వంటి పలువురు మాజీలు రవీంద్ర జడేజాపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ ట్వీట్లు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల ఆనందానికైతే హద్దే లేకుండా పోయింది.

Story first published: Tuesday, April 20, 2021, 9:17 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X