
ముంబై: వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్, 'మిస్టర్ ఐపీఎల్' సురేశ్ రైనా ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. గతేడాది టోర్నీకి దూరమైన రైనా.. ఈఏడాది సీజన్ తొలి మ్యాచ్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. మార్కస్ స్టోయినీస్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతిని భారీ సిక్సర్ బాది.. 32 బంతుల్లోనే ఫిఫ్లీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 36 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రైనా నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఐపీఎల్ 2021లో తొలి మ్యాచ్ ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులను నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొన్న మహీ.. పరుగులేమీ చేయకుండానే ఔట్ అయ్యాడు. పేసర్ అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి ధోనీ ఔట్ అయ్యాడు. బంతిని వికెట్ల మీదకు ఆడుకుని మహీ బోల్డ్ అయ్యాడు. దీంతో చాలా రోజుల తరవాత మైదానంలో ధోనీని చూసిన అభిమానులు నిరాశపడ్డారు. మహీ టోర్నీలో డకౌట్ అవ్వడం ఇది నాలుగోసారి. 2010లో రెండు సార్లు.. 2015, 2021లో ఒక్కోసారి డకౌట్ అయ్యాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. ఇక్కడ మూడు బంతులు ఆడిన డుప్లెసిస్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో 7 పరుగులకే సీఎస్‌కే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఐపీఎల్‌లో డుప్లెసిస్ ఇలా ఎల్బీగా ఔట్ కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 85 మ్యాచ్‌లకు గాను ఫాఫ్ 78 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ ఫాఫ్ ఏనాడు ఐపీఎల్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరలేదు.