For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఇది నట్టు కథ, మీ కథ.. మీది నట్టూదీ ఒకే కథ! నెట్టింట అలరిస్తున్న సన్‌రైజర్స్‌!!

IPL 2021: Sunrisers Hyderabad edits Needi Naadi Oke Katha poster with T Natarajan

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. 14వ ఎడిష‌న్ ఐపీఎల్.. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఐపీఎల్‌ 2021 కోసం పలు జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ మొదలెట్టారు. లీగ్ ఆరంభానికి సమయం సమీపిస్తుండటంతో.. జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఇక అభిమానులతో తాజా విశేషాలు పంచుకోవాలని ప్రాంఛైజీలు కూడా ఆరాటపడుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఆకట్టుకొనే విషయాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ట్వీట్లతో పలు జట్లు బజ్‌ పెంచేస్తున్నాయి.

ఇది నట్టు కథ

అన్ని జట్లలో కెల్ల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు కథానాయకులు, చిత్రాల నేపథ్యంలో ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మన్‌ మనీశ్ ‌పాండేను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌గా, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను మహేష్ బాబులా చూపించిన సన్‌రైజర్స్‌.. తాజాగా యార్కర్ కింగ్ టీ నటరాజన్‌తో 'నీదీ నాదీ ఒకే కథ' పోస్టర్‌ పంచుకుంది. 'ఇది నట్టు కథ, మీ కథ.. మీది, నట్టూదీ ఒకే కథ' అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

క్వారంటైన్‌లో నట్టూ

క్వారంటైన్‌లో నట్టూ

ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ కోసం నటరాజన్ సిద్దమవుతున్నాడు. గురువారమే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో కలిసాడు. నిబంధనల మేరకు అతడు ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ అనంతరం నేరుగా జట్లతో కలిసేవారికి క్వారంటైన్ మినహాయింపు ఉంది. అయితే నట్టూ బబుల్ ధాటి ఇంటికి వెళ్లొచ్చాడు. దాంతో అతను క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. గత సీజన్‌లో తనదైన యార్కర్లతో అదరగొట్టిన నట్టూ ఈసారి అంతకుమించి రాణించాలని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో నటరాజన్ అదరగొట్టిన విషయం తెలిసిందే.

తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో ఢీ

తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో ఢీ

ఐపీఎల్ 2021 మ్యాచులకు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మన తెలుగు జట్టు అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో ఆడే అవకాశం లేదు. ఈసారి ఏ జట్టుకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు. చెన్నై వేదికగా వచ్చే నెల 11న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు‌తో తలపడనుంది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచులకు గాను 11 మ్యాచులు రాత్రి 7.30 గంటలకి హైదరాబాద్ ఆడనుంది.

జంబో రిటర్న్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ మాత్రమే కాదు.. మిగతా ప్రాంచైజీలు, ఆటగాళ్లు కూడా ట్వీట్లతో బజ్‌ పెంచేస్తున్నారు. ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ 'హమ్‌ హై తయార్‌' అంటున్నాడు. టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వచ్చేశాడంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌ వీడియో పంచుకుంది. 'జంబో రిటర్న్‌' అంటూ అనిల్ కుంబ్లే బౌలింగ్‌ చేస్తున్న వీడియోను పంజాబ్‌ కింగ్స్‌ పోస్ట్‌ చేసింది. 'చిన్న తలా ఏం వండుతున్నాడో తెలుసా?' అంటూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్వీటింది.

Story first published: Friday, April 2, 2021, 8:19 [IST]
Other articles published on Apr 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+