హైదరాబాద్ ఫ్యాన్స్ చాలా ప్రేమని ఇచ్చారు.. పెర్ఫార్మెన్స్ రూపంలో తిరిగిచ్చేయాలి! లేకపోతే లావైపోతా!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. 14వ ఎడిషన్ ఐపీఎల్.. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఐపీఎల్ 2021 కోసం పలు జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. ఇప్పటికే కొందరు స్టార్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. లీగ్ ఆరంభానికి సమయం సమీపిస్తుండటంతో.. జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియాలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో మీమ్స్, ట్వీట్లతో పలు జట్లు బజ్ పెంచేస్తున్నాయి.
బాబుగా భువీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ తెలుగు కథానాయకులు, చిత్రాల నేపథ్యంలో ట్వీట్లు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మనీశ్ పాండేను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌గా చూపించిన సన్‌రైజర్స్.. తాజాగా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో 'శ్రీమంతుడు' పోస్టర్‌ను రూపొందించి పోస్ట్ చేసింది. అంతేకాదు ఆ సినిమాలోని డైలాగ్‌ను కూడా అద్భుతంగా చెప్పింది. 'హైదరాబాదీ ఫ్యాన్స్ నాకు చాలా ప్రేమని ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ రూపంలో తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతా. శిబిరంలోకి భువీ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం' అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది.

నెట్టింట వైరల్
భువనేశ్వర్ కుమార్‌కు సంబందించిన శ్రీమంతుడు పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భువనేశ్వర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భువీ అదరగొట్టాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాలు అందించాడు. తన పదునైన స్వింగర్లతో ఇంగ్లీష్ ఆటగాళ్లను ఆడుకున్నాడు. పరుగులను నియంత్రిస్తూ కీలకమైన డెత్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. గతేడాది గాయపడటంతో అతడు మధ్యలోనే ఐపీఎల్‌ను వదిలేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భువీ కీలక బౌలర్ అన్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్‌గా మనీష్
మనీశ్ పాండే సన్‌రైజర్స్ జట్టులో కీలక ఆటగాడు కాబట్టి.. ఐపీఎల్ 2021లో అతడు ఎలా ఆడాలని కోరుకుంటుందో ఆ జట్టు యాజమాన్యం ఇటీవల ఓ ట్వీట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమాలోని ఓ పోస్టర్‌ను సన్‌రైజర్స్ ఎడిట్ చేసింది. కత్తి పట్టుకొని పరుగెత్తుతున్న ఎన్టీఆర్ పోస్టర్‌ను మనీశ్‌తో ఎడిట్ చేసింది. ఆ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. 'మనీశ్ పాండే నుంచి ఏం కోరుకుంటామో మనకు తెలిసిందే. నిర్దాక్షిణ్యంతో కూడిన బ్యాటింగ్' అని కాప్షన్ పెట్టింది. ఆ పోస్టర్‌లో పాండే అచ్చం ఎన్టీఆర్‌లానే ఉన్నాడు.

ఉప్పల్ స్టేడియంలో ఆడే అవకాశం లేదు:
ఐపీఎల్ 2021 మ్యాచులకు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మన తెలుగు జట్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడే అవకాశం లేదు. ఈసారి ఏ జట్టుకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు. చెన్నై వేదికగా వచ్చే నెల 11న సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచులకు గాను 11 మ్యాచులు రాత్రి 7.30 గంటలకి హైదరాబాద్ ఆడనుంది.
'చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన లోపం అదే.. రైనా కూడా విఫలమైతే ఇక అంతే సంగతి'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications