IPL 2021: ఈ సంతోషం జీవితకాలం ఉండాలి.. లవ్ యూ డేవిడ్ వార్నర్!!

ముంబై: మరో ఐదు రోజులో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌కు ముందు అన్ని జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన హోటల్స్‌కు చేరుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ శుక్రవారమే ఆస్ట్రేలియా నుంచి చెన్నై చేరుకుని.. ప్రస్తుతం తన ప్రాంచైజీ ఏర్పాటు చేసిన గదిలోనే క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆదివారం డేవిడ్ వార్నర్, క్యాండీస్ వార్నర్‌ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

లవ్ యూ వార్నర్
పెళ్లిరోజు సందర్భంగా క్యాండీస్ వార్నర్ చేతిపై ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. '6 సంవత్సరాల బలమైన బంధం. నా ప్రియమైన శ్రీమతికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా' అని వార్నర్ ట్వీట్ చేశాడు. '6 సంవత్సరాల వివాహ బంధం. ఈ సంతోషం జీవితకాలం ఉండాలి. నా ప్రియమైన భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. లవ్ యూ వార్నర్' అని క్యాండీస్ ట్వీట్ చేశారు.

క్వారంటైన్‌లో ఎలా గడపాలో
అంతకుముందు డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకొని క్వారంటైన్‌లో ఎలా గడపాలో సలహాలు, సూచనలు చేయమని అభిమానులను కోరాడు. 'ఐపీఎల్ 2021 ఆడేందుకు వచ్చాను. క్వారంటైన్‌లో ఉండడానికి సిద్ధమయ్యా. కానీ నాకు ఒకటే సమస్య ఎదురైంది. క్వారంటైన్‌లో ఉండాల్సినన్ని రోజులు ఎలా గడపాలో మీరు సలహాలివ్వండి. వాటిని కామెంట్స్‌లో పెట్టండి' అంటూ పేర్కొన్నాడు. ఇది చూసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 'టిక్‌టాక్ మిస్ అవుతున్నట్లు ఉన్నావ్' అంటూ తనదైనశైలిలో హాస్యం జోడించిన కామెంట్ చేశాడు.

టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్
గతేడాది కరోనా వైరస్ వల్ల ఐపీఎల్ 13వ సీజన్ వాయిదా పడిన వేళ.. లాక్‌డౌన్‌లో డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలు చేశాడు. తనతో పాటు భార్య క్యాండీస్, తన ముగ్గురు పిల్లలతో పాటు డ్యాన్సులు చేసి నెటిజెన్లకు చేరువయ్యాడు. ముఖ్యంగా టాలీవుడ్ పాటలు, సినిమా డైలాగులతో అలరించాడు. అయితే కొద్ది నెలల క్రితం టిక్‌టాక్‌తో పాటు మరిన్ని చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంతో వార్నర్ మరిన్ని వీడియోలు చేయలేకపోయాడు.
2016లో కెప్టెన్‌గా బాధ్యతలు
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపిస్తున్న డేవిడ్ వార్నర్.. ఈ క్యాష్ రిచ్ లీగ్ కెప్టెన్లలో విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్.. 2018 మినహా అన్ని సీజన్లలో హైదరాబాద్ జట్టును ప్లేఆఫ్‌కు తీసుకెళ్లాడు. ఇక ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లాడిన వార్నర్ 42.71 సగటుతో 5254 పరుగులు సాధించగా.. ఇందులో నాలుగు సెంచరీలు, 48 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడనుంది.
IPL 2021 ముంగిట బెంగళూరుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications