శుభ్‌మన్ గిల్ వైఫల్యానికి అదే కారణం.. ఇంకా 21 ఏళ్లే కూల్‌గా ఉండాలి: గవాస్కర్

న్యూఢిల్లీ: అంచనాలు పెరిగి ఒత్తిడికి గురువ్వడమే టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వైఫల్యానికి కారణమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అతను ఇంకా 21 ఏళ్ల కుర్రాడేనని, ప్రశాంతంగా ఉంటూనే వైఫల్యాలను అధిగమించాలని లిటిల్ మాస్టర్ సూచించాడు. గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జోరు కనబర్చాడు.

కానీ ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో పాటు ఈ సీజన్‌ ఐపీఎల్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. 7 మ్యాచ్‌ల్లే కేవలం 132 పరుగులే చేశాడు. అయితే ఫామ్ కోల్పోయిన శుభ్‌మన్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది. డబ్ల్యూటీసీ, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక చేసిన 20 మంది జట్టులో ఈ యువ ఓపెనర్‌కు చోట కల్పించింది.

అంచనాలే..

అంచనాలే..

ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడిన గవాస్కర్ అతని వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించాడు.‘శుభ్‌మన్ గిల్‌ ఇలా ఉన్నపళంగా విఫలమవ్వడానికి కారణం నాకు తెలిసి అంచనాల పెరిగి ఒత్తిడికి గురవ్వడమే. ఐపీఎల్‌ కన్నా ముందు పరిస్థితులు వేరు. అతడో నమ్మకమైన యువ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో అతడి ఆట చూశాక బాగా ఆడతాడనే అంచనాలు పెరిగాయి. ఆ ఒత్తిడి కారణంగానే ఇలా విఫలమవుతున్నాడని అనిపిస్తోంది.

స్వేచ్చగా ఆడుతూ..

స్వేచ్చగా ఆడుతూ..

అతనిప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇంకా 21 ఏళ్ల కుర్రాడే. ఎవరికైనా వైఫల్యాలు ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవాలి. అతను ఓపెనింగ్‌ చేస్తూ దేని గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడాలి. బయటి అంచనాలను పట్టించుకోకుండా సహజసిద్ధమైన ఆట ఆడితే పరుగులవే వస్తాయి. భారీ అంచనాల కారణంగా ప్రతీ బంతికి పరుగులు చేయాలనే ఒత్తిడి ఉంటుంది. వీలైనం త్వరగా ఆ ఒత్తిడి నుంచి శుభ్‌మన్ బయటపడాలి' అని గవాస్కర్‌ వివరించాడు.

జోరు కొనసాగించలేక..

జోరు కొనసాగించలేక..

ఆస్ట్రేలియా పర్యటనలో 91, 50‌ కీలక ఇన్నింగ్స్‌లతో పాటు ఓపెనర్‌గా మంచి శుభారంభాలు అందించి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ జోరును ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కొనసాగించలేకపోయాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం ఐపీఎల్‌లోనూ దారుణంగా విఫలయ్యాడు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. కేకేఆర్ తరఫున 7 మ్యాచ్‌ల్లో వరుసగా 0, 15, 33, 21, 0, 11, 9, 43 విఫలమయ్యాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 9, 2021, 11:43 [IST]
Other articles published on May 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X