అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్

IPL 2021 : ‘He Finds Ways Of Getting Out’ – Sunil Gavaskar On Sanju Samson || Oneindia Telugu

ముంబై: సంజు శాంసన్.. అప్ కమింగ్ క్రికెటర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తున్నాడు. క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేనప్పటికీ.. అతనిపై ఎక్కడా లేని విశ్వాసాన్ని ఉంచింది ఆ టీమ్ మేనేజ్‌మెంట్. అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్‌ను సైతం వదులుకుంది. స్టీవ్ స్మిత్‌ను బయటికి సాగనంపి.. సంజు శాంసన్‌కు జట్టు పగ్గాలను అప్పగించింది. స్మిత్ ఒక్కడే కాదు.. జోస్ బట్లర్ వంటి అపారమైన క్రికెటింగ్ అనుభవం ఉన్న ఆటగాళ్లను కూడా పక్కన పెట్టింది. సీనియర్లను కాదని జూనియర్‌కు జట్టు సారధ్య బాధ్యతలను అప్పగించింది.

సంజు ఏం చేస్తున్నాడు..

సంజు ఏం చేస్తున్నాడు..

జట్టు మేనేజ్‌మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని సంజు శాంసన్ నిలబెట్టుకుంటున్నాడా? అనే ప్రశ్నకు అడ్డంగా తల ఊపాల్సి వస్తోంది. అటు కేప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా అతను వరుసగా విఫలమౌతున్నాడు. సంజు కేప్టెన్సీలో కొనసాగుతోన్న రాజస్థాన్ రాయల్స్.. ఇప్పటిదాకా ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి దిగజారింది. ఆ ఒక్క మ్యాచ్ కూడా చివరి ఓవర్‌లో సాధించిందే. రాజస్థాన్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్.. తెగించి ఆడకపోయి ఉంటే. ఆ మ్యాచ్‌ను కూడా ఓడిపోయి ఉండేదనడంలో సందేహాలు అనవసరం.

తొలి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించి..

తొలి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించి..

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్.. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టింది. ఆ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీమ్.. 221 పరుగుల భారీ స్కోర్‌ను అందుకోగా.. రాజస్థాన్ జట్టు గెలుపుటంచుల వరకూ వెళ్లింది. ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. నాలుగు పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. ఆ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడిన విషయం ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. 63 బంతుల్లోనే 119 పరుగులు చేశాడతను. తన సత్తాను నిరూపించుకున్నాడు. చివరికంటా పోరాడి.. హీరో అనిపించుకున్నాడు.

ఇప్పుడు జీరో..

ఇప్పుడు జీరో..

ఆ మ్యాచ్‌‌లల్లో రాజస్థాన్ రాయల్స్ ఆటతీరు ఏ క్రికెట్ అభిమాని కూడా ఊహించని విధంగా అధ్వాన్నంగా తయారైంది. మ్యాచ్‌లు సాగుతున్న కొద్దీ రాటుదేలాల్సిన ఆ జట్టు నిస్సారంగా మారింది. విజయం కోసం ముఖం వాచి పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. మున్ముందు ఎదుర్కోవాల్సినవన్నీ కఠిన మ్యాచ్‌లే. ఈ పరిస్థితుల్లో ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించుకుని, విజయాలను అందుకుంటుందనే ఆశ సగటు అభిమానిలో ఏ మాత్రం కనిపించట్లేదు. ప్రత్యేకించి- ముంబై వాంఖెడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఓడిపోయిన తీరు.. ఆ జట్టును దారుణంగా దెబ్బకొట్టింది. 177 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ..ఏకపక్షంగా దాన్ని కోల్పోవడం జట్టు అస్థిత్వాన్ని చాటుతోంది.

సంజు శాంసన్ వరుస వైఫల్యాలతో..

సంజు శాంసన్ వరుస వైఫల్యాలతో..

ఈ పరిణామాల మధ్య సంజు శాంసన్.. విమర్శలకు కేంద్రబిందువు అవుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ తరువాత.. ఆడిన మూడింటిని కలిపి అతను చేసిన వ్యక్తిగత స్కోర్ 26 పరుగులు. ఇది అతని బ్యాటింగ్ నిలకడ లేమిని సూచిస్తోందని టీమిండియా మాజీ కేప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ విమర్శించారు. అతని నిలకడలేమి తనం వల్లే టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. తాను ఎలా అవుట్ కావాలో.. అతనికి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. అవుట్ కావడానికి మార్గాలను సంజు శాంసన్ వెతుక్కున్నాడని చురకలు అంటించారు.

క్రికెట్ షాట్లకు దూరంగా..

క్రికెట్ షాట్లకు దూరంగా..

సంజు శాంసన్ బ్యాటింగ్ శైలి పట్ల సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు. క్రికెట్ షాట్లకు దూరంగా అతని బ్యాటింగ్ శైలి ఉంటోందని వ్యాఖ్యానించారు. అతని బ్యాటింగ్ మళ్లీ గాడిన పడాలంటే.. సరైన క్రికెట్ షాట్లను ఆడాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమని తనకు అనిపిస్తోందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అతనితో అతనికే సమస్యలు ఉన్నాయని, అందుకే టీమిండియాలో చోటును శాశ్వతం చేసుకోలేకపోతున్నాడని అన్నారు. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఓ ప్లేయర్.. ఆ తరువాతి మ్యాచ్‌లల్లో రాణించట్లేదంటే లోపం అతనిలోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని చెప్పారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 23, 2021, 11:42 [IST]
Other articles published on Apr 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X