Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెచ్చగొడుతోన్న నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ భార్య: ఉచ్చులో సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్

IPL 2021: SRHs Rashid Khan and Erin Holland banter on Instagram

చెన్నై: రషీద్ ఖాన్.. ఆధునిక క్రికెట్‌లో స్పిన్ మాంత్రికుడు. కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తోన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వార్నర్ సేనలో టాప్ క్లాస్ బౌలర్. బౌలింగ్ విభాగంలో కీలకం అతనే. 66 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన అతను 75 వికెట్లను పడగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించే సత్తా రషీద్ ఖాన్ సొంతం. డెత్ ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్ చేయగలడు.

రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం ఎలా ఉండబోతోందనేది ఈ సాయంత్రం తేలుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా ఈ సాయంత్రం చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. రషీద్ ఖాన్, ఎరిన్ హాలెండ్ మధ్య వాడివేడిగా వాగ్వివాదం నడిచింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వారిద్దరి మధ్య మాటలయుద్ధం నడిచింది.

IPL 2021: SRHs Rashid Khan and Erin Holland banter on Instagram

ఎరిన్ హాలెండ్ మరెవరో కాదు. కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ భార్య. రషీద్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ దీనికి కారణమైంది. ఐపీఎల్ 14వ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌ను ఆడటానికి తాను సంసిద్ధంగా ఉన్నానంటూ రషీద్ ఖాన్ తన అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఆరెంజ్ ఆర్మీ ఆర్ నథింగ్ అంటూ కామెంట్స్ పెట్టాడు. అది ఎరిన్ హాలెండ్ కంట్లో పడింది. వెంటనే ఆమె దానికి రిప్లయ్ పెట్టారు. తాను కోల్‌కత నైట్ రైడర్స్‌ను సపోర్ట్ చేస్తున్నానంటూ కామెంట్ చేశారు.

IPL 2021: SRHs Rashid Khan and Erin Holland banter on Instagram

ఈ సారి తన సపోర్ట్ నైట్ రైడర్స్‌కేనంటూ పేర్కొన్నారు. దీనికి రషీద్ ఖాన్.. నో అంటూ రిప్లయ్ ఇచ్చాడు. సరదాకే అయినా.. మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కానున్న నేపథ్యంలో ఇద్దరు సెలెబ్రిటీల మధ్య చోటు చేసుకున్న ఈ కన్వర్జేషన్ ఆసక్తిగా మారింది. మ్యాచ్‌లో బెన్ కటింగ్‌పై రషీద్ ఖాన్ ఎలా బౌల్ చేయగలడనే విషయంపై ఫోకస్ పెట్టేలా చేసింది. ఆస్ట్రేలియకు చెందిన బెన్ కటింగ.. ఈ సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ ఫ్రాంఛైకి ఎంపికయ్యాడు.

Story first published: Sunday, April 11, 2021, 13:04 [IST]
Other articles published on Apr 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+