న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs MI: కేన్‌ మామకు టఫ్‌ఫైట్.. శంకర్ ఔట్.. వార్నర్‌కు నో చాన్స్.. తుది జట్లు ఇవే!

IPL 2021: SRH vs MI Dream11 Team Prediction, Tips, Best Playing 11 Details

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఐపీఎల్‌ 2021 సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్న వేళ.. పాయింట్స్‌‌ టేబుల్లో చివరి ప్లేస్‌‌లో ఉన్న సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌.. డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ముంబై ఇండియన్స్‌‌తో రెండోసారి తలపడనుంది. ఏడు మ్యాచ్‌‌ల్లో ఆరింటిలో ఓడిన ఆరెంజ్ ఆర్మీ‌ మంగళవారం జరిగే పోరులో పటిష్ట ముంబైతో టఫ్‌‌ ఫైట్‌‌ ఎదుర్కోనుంది. ప్లే ఆఫ్స్‌‌ రేసులో నిలవాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌‌ల్లో కనీసం ఆరైనా నెగ్గాల్సిన పరిస్థితి తెచ్చుకున్న హైదరాబాద్‌‌కు ఈ పోరు చావోరేవో లాంటిదే. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన ముంబై ఇండియన్స్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అదే జోరులో హ్యాట్రిక్ విజయాన్నందుకోవాలనే పట్టుదలతో ఉంది.

అద్భుతం జరగాల్సిందే..

అద్భుతం జరగాల్సిందే..

కొత్త కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ సారథ్యంలో గత పోరులో రాజస్తాన్‌‌ చేతిలో చిత్తుగా ఓడిన రైజర్స్‌‌ డీలా పడింది. ముంబైపై గెలిస్తే మాత్రం కాన్ఫిడెన్స్‌‌ అమాంతం పెరగడం ఖాయం. కానీ, డిఫెండింగ్‌‌ చాంప్‌‌ను ఓడించాలంటే అద్భుతం చేయాల్సిందే. మొన్నటి వరకు మిడిలార్డర్ సమస్యతో ఓటమిపాలైన జట్టు ఇప్పుడు బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా తడబడుతోంది.

వార్నర్‌‌పై వేటు తర్వాత బెయిర్‌‌స్టోతో ఇన్నింగ్స్‌‌ ఆరంభించిన మనీశ్‌‌ పాండే ఆకట్టుకున్నా.. ఎప్పట్లానే మిడిలార్డర్‌‌ ప్రభావం చూపలేకపోయింది. ఈ సమస్యను పరిష్కరిస్తేనే ఆరెంజ్‌‌ ఆర్మీ పుంజుకోగలదు. వరుసగా విఫలమవుతున్న విజయ్ శంకర్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా వార్నర్‌కు చాన్స్ రాకపోవచ్చు. రాజస్థాన్ మ్యాచ్‌లో విఫలమైన మహ్మద్ నబీ ప్లేస్ జాసన్ హోల్డర్ బరిలోకి దిగవచ్చు. బౌలింగ్‌లో భువీ సత్తా చాటాల్సి ఉంది.

పటిష్టంగా ముంబై..

పటిష్టంగా ముంబై..

మరోవైపు వరుసగా రెండు విక్టరీలతో ముంబై ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది. పైగా, పొలార్డ్‌‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌‌తో చెన్నైపై భారీ టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చేయడం, మిడిలార్డర్‌‌ క్లిక్‌‌ అవడంతో టీమ్‌‌ కాన్ఫిడెన్స్‌‌ రెట్టింపైంది. సూర్యకుమార్ మినహా టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ అంతా టచ్‌లోకి వచ్చింది. బుమ్రా, బౌల్ట్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఇదే ఊపుతో హైదరాబాద్‌‌ను మరోసారి ఓడించాలని చూస్తోంది.

గత మ్యాచ్‌లో విఫలమైన జిమ్మీ నీషమ్‌కు మరో అవకాశం ఇవ్వచ్చు. ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే, కేకేఆర్‌‌ టీమ్‌‌లో ఇద్దరు ప్లేయర్లు, ఢిల్లీ గ్రౌండ్‌‌ స్టాఫ్‌‌లో కొందరు కరోనా బారిన పడడంతో రెండు జట్లూ సోమవారం ప్రాక్టీస్‌‌ చేయలేదు. మ్యాచ్‌‌పై కూడా అనుమానాలు నెలకొన్నాయి.

ముఖా ముఖి రికార్డు..

ముఖా ముఖి రికార్డు..

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 17 మ్యాచ్‌లు జరగ్గా.. 9 విజయాలతో ముంబై పై చేయి సాధించింది. సన్‌రైజర్స్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ముంబై 13 పరుగులతో విజయాన్నందుకుంది. సునాయసంగా గెలిచే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ మిడిలార్డర్ బలహీనతతో ఓటమిపాలైంది. గత సీజన్‌లో మాత్రం ఇరు జట్లు చెరొక విజయాన్నందుకున్నాయి.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్: మనీష్ పాండే, జానీ బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్/అభిషేక్ శర్మ/సుచిత్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జిమ్మీ నీషమ్, రాహుల్ చాహర్, దావల్ కులకర్ణి, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

డ్రీమ్ 11 ప్రిడిక్షన్: జానీ బెయిర్ స్టో(వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ధావల్ కులకర్ణి, రాహుల్ చాహర్

Story first published: Tuesday, May 4, 2021, 10:10 [IST]
Other articles published on May 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X