For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs DC: నట్టూ, భువీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.. వారు లేకుంటే సన్‌రైజర్స్‌కు విజయం కష్టమే! ప్రూఫ్ ఇదే!

IPL 2021, SRH vs DC: Sunrisers Hyderabad struggling with T Natarajan and Bhuvneshwar Kumar today
IPL 2021 : వీక్ టీమ్ తో పోరాడుతున్న SRH, Fans Missing Bhuvi | Srh vs Dc || Oneindia Telugu

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో భాగంగా చెన్నై చెపాక్ మైదానంలో ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరే శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా (53; 39 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్స్‌), శిఖర్‌ ధావన్‌ (28; 26 బంతుల్లోనే 3 ఫోర్లు) దంచికొట్టారు. ముఖ్యంగా పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలతో చెలరేగుతూ సన్‌రైజర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. ఈ క్రమంలోనే షా 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

రషీద్‌ ఖాన్‌ వేసిన 11వ ఓవర్లో శిఖర్ ధావన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక 12వ ఓవర్లో పృథ్వీ షా రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఓపెనర్లు పెవిలియన్ చేరారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు తేలిపోవడంతోనే ఢిల్లీ తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం చేసింది. ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్, అభిషేక్ శర్మ ధారాళంగా పరుగులు ఇచ్చారు. దీంతో సన్‌రైజర్స్‌ స్టార్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరూ ఉంటే ఢిల్లీ ఇన్ని పరుగులు చేసేది కాదు. ఇదే అభిప్రాయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. 'నట్టూ, భువీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది', 'నట్టూ, భువీ లేకుంటే సన్‌రైజర్స్‌కు విజయం కష్టమే.. ఢిల్లీ మ్యాచే ఇందుకు ఓ ఉదాహరణ' అని ఫాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

మోకాలి గాయంతో టీ నటరాజన్ ఈ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే నట్టూ.. 2 వికెట్లు మాత్రమే తీశాడు. 'ఈ సీజన్ మిగతా మ్యాచ్‌లకు దూరమవ్వడం బాధగా ఉంది. గత సీజన్‌లో అద్భుతంగా రాణించి ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడటంతో నాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ దురదృష్టవశాత్తు నా మోకాలికి గాయమవ్వడం, సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతుగా నిలిచిన సన్‌రైజర్స్ ఫ్యామిలీకి, సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్స్, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు' అని నట్టూ పేర్కొన్నాడు.

ఇక భువనేశ్వర్ కుమార్‌కు తొడ కండరాలు పట్టేసిన విషయం తెలిసిందే. చెపాక్‌ మైదానంలో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీకి గాయం అయింది. ఆ మ్యాచులో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. గాయం కారణంగానే మరో ఓవర్ వేయలేదు. ప్రస్తుతం భువీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌ సాధిస్తే మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. భువీ తుది జట్టులో ఉంటే.. సన్‌రైజర్స్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు కొండంత బలం.

Story first published: Sunday, April 25, 2021, 21:37 [IST]
Other articles published on Apr 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+