అందుకే ఐపీఎల్ 2021 భారత్‌లో నిర్వహించాం.. అవన్నీ పనికిరాని విమర్శలు: సౌరవ్ గంగూలీ

న్యూఢిల్లీ: భారత్- ఇంగ్లండ్ సిరీస్‌లను ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడంతోనే ఐపీఎల్ 2021 కూడా ఇక్కడ నిర్వహించాలనుకున్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ సీజన్ క్యాష్ రిచ్ లీగ్ కోసం తొలుత యూఏఈ చర్చకు వచ్చినప్పటికీ దేశంలో కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలిపాడు. ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా వైరస్ కమ్మేయడంతో లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే లీగ్ నిర్వహణ విషయంలో బీసీసీఐ అట్టర్ ఫ్టాప్ అయిందని, యూఏఈ వేదికగా నిర్వహించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దాదా తమ నిర్ణయం సరైందేనని సమర్థించుకున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా పలు ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడు.

 ప్రమాదాన్ని ఊహించలేదు..

ప్రమాదాన్ని ఊహించలేదు..

ఈ ప్రమాదాన్ని ఐపీఎల్ షెడ్యూల్ సిద్ధం చేసే సమయంలో తాము ఊహించలేకపోయామని తెలిపాడు. ఐపీఎల్ ప్రారంభం నాటికి దేశంలో కేసులు సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపాడు. ‘ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు స్వదేశంలో భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లను సమర్థవంతంగా నిర్వహించాం. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌ను కూడా ఇక్కడే నిర్వహించాలనుకున్నాం. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకునే సమయంలో భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొంత మంది సభ్యులు యూఏఈలో టోర్నీని నిర్వహిద్దామని ప్రతిపాదించారు. కానీ.. ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా చాలా తక్కువ కరోనా కేసులు నమోదవడంతో.. ఆ ప్రతిపాదనని తిరస్కరించాం. కానీ.. కేవలం మూడు వారాల వ్యవధిలోనే కేసులు ఊహించనిరీతిలో పెరిగిపోయాయి'అని గంగూలీ పేర్కొన్నాడు.

అనవసర విమర్శలు..

అనవసర విమర్శలు..

‘ఐపీఎల్ ప్రారంభంలో దేశంలో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చాలా తేలికగా విమర్శలు చేయవచ్చు. కానీ అప్పట్లో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువ. విపరీతమైన కేసులు ఉన్న ముంబైలో మేం విజయవంతంగా లీగ్‌ను కొనసాగించాం. ఒక్క ప్లేయర్ కూడా వైరస్ బారిన పడలేదు. యూకే లాక్‌డౌన్ చేసిన సమయంలోనే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా టోర్నీలన్నీ ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్యే జరుగుతున్నాయి.'అని దాదా చెప్పుకొచ్చాడు.

 అది చెప్పలేం..

అది చెప్పలేం..

బయోబబుల్‌లో వైరస్ ఎంట్రీ ఇలా ఇచ్చిందనే విషయాన్ని చెప్పడం చాలా కష్టమని సౌరవ్ గంగూలీ తెలిపాడు. దేశంలో చాలా మంది కరోనా వైరస్ బారిన పడ్డారని, ఆ క్రమంలోనే రావచ్చన్నాడు. అయితే ఏ ప్లేయర్ కూడా బయో బబుల్‌ను బ్రేక్ చేయలేదని స్పష్టం చేశాడు. లీగ్‌ను మళ్లీ నిర్వహించడంపై ప్రయత్నాలు చేస్తున్నామని, కానీ ఇప్పుడే ఏం చెప్పలేమని దాదా స్పష్టం చేశాడు. ఇప్పుడు ఏది మాట్లాడినా చాలా తొందరవుతుందని తెలిపాడు. ఆటగాళ్ల వ్యాక్సినేషన్‌కు సమయం పడుతుందని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఎవరికీ వారు సొంతం తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు.

ఇప్పుడే స్పందించను..

ఇప్పుడే స్పందించను..

షెడ్యూల్ ప్రకారమే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతుందన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌పై వస్తున్న వార్తలపై స్పందించడానికి నిరాకరించాడు. యూఏఈ వేదికగా నిర్వహిస్తారా? అన్న ప్రశ్నకు తాను ఎం చెప్పలేనని, చాలా ముందు మాట్లాడినట్లు అవుతుందని పేర్కొన్నాడు. కరోనాపై పోరాటానికి తమ వంతు సాయం చేస్తామని, గతేడాది రూ.51 కోట్లు ఇచ్చామని, ఈసారి కూడా విరాళం ప్రకటిస్తామని దాదా తెలిపాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, May 6, 2021, 12:03 [IST]
Other articles published on May 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X