
భారతీయులు ఒత్తిడి తట్టుకోగలరు:
తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'విదేశీ క్రికెటర్లతో పోలిస్తే మన భారతీయులు మరికాస్త ఎక్కువ ఒత్తిడి తట్టుకోగలరు. నేను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజీలాండ్ క్రికెటర్లతో కలిసి ఆడాను. మానసిక ఆరోగ్యం విషయంలో వారు సున్నితంగా ఉంటారు. 6-7నెలలుగా బయో బుడగల్లో విపరీతంగా క్రికెట్ జరుగుతోంది. ఇది చాలా కఠినమైన విషయం. హోటల్ నుంచి మైదానంలోకి వచ్చి ఒత్తిడి అనుభవించి మళ్లీ హోటల్‌కే వెళ్లాలి. ఇదంతా ఓ కొత్త జీవితం' అని అన్నారు.

కరోనా భయం పట్టుకుంది:
'ఆస్ట్రేలియా టీంను ఓసారి గమనిస్తే.. టీమిండియా పర్యటన తర్వాత టెస్టు సిరీస్ కోసం వారు దక్షిణాఫ్రికా వెళ్లాలి. కానీ అక్కడకు వెళ్లలేదు. వారికీ కరోనా భయం పట్టుకుంది. అందుకే చాలా సానుకూలంగా ఉండాలి. మానసికంగా సన్నద్ధం అవ్వాలి. మంచి జరగాలని మనమంతా సమష్టిగా సానుకూలంగా ఉండటం అవసరం' అని అని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. ఐపీఎల్ 2021 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. దాదా అన్ని విషయాలు చూసుకుంటూ లీగ్ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నారు.

కెప్టెన్సీ నుంచి తొలగించడం భారీ ఎదురుదెబ్బ
2005 తర్వాత తనను కెప్టెన్సీ నుంచి తొలగించడం భారీ ఎదురుదెబ్బని దాదా వెల్లడించారు. 'కొన్ని ఘటనలు ఎదుర్కొని తీరాల్సిందే. మన మానసిక వైఖరి బాగుంటే వాటిని ఎదుర్కోగలం. క్రీడలు, వ్యాపారం ఏదైనా కానివ్వండి.. జీవితంలో దేనికీ హామీలేదు. ఒడుదొడుకులు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా ఒత్తిడి ఉంటుంది. మనమంతా వేర్వేరు రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాం. తొలి టెస్టు ఆడుతున్నప్పుడు ప్రపంచం మనల్ని గుర్తించాలన్న ఒత్తిడి ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణంలో ఎప్పుడో ఒకసారి ఫామ్ కోల్పోతే జనాల నుంచి విమర్శల ఒత్తిడి వస్తుంది. అన్నింటిని తట్టుకుని నిలబడాలి' అని దాదా చెప్పుకొచ్చారు.

113 టెస్టులు, 311 వన్డేలు:
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశారు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశారు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్లో 10 వికెట్లని దాదా పడగొట్టారు. మీడియం పేస్ బౌలింగ్ దాదా ఆకట్టుకున్నారు.
IPL 2021: హమ్మయ్య.. ఆటగాళ్లందరికీ కరోనా నెగెటివ్!!
https://telugu.mykhel.com/cricket/ipl-2021-mumbai-indians-players-and-support-staff-test-negative-for-coronavirus-034150.html?story=1


Click it and Unblock the Notifications












