Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: చహల్‌ భార్యతో ధావ‌న్.. ఇద్దరూ ఇరగదీశారుగా (వీడియో)!!

IPL 2021: Shikhar Dhawan Dance With Dhanashree Verma

ముంబై: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ బాంగ్రా స్టెప్పులతో అదరగొట్టాడు. మణికట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌ భార్య, కొరియోగ్రాఫ‌ర్ ధనశ్రీ వర్మతో కలిసి గబ్బర్ బాంగ్రా డ్యాన్స్‌ ఇరగదీశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'భాంగ్రా ఇన్ గ‌బ్బ‌ర్ స్టైల్' అంటూ ధ‌న‌శ్రీ ఈ వీడియోను పోస్ట్ చేసింది. చహల్, ధనశ్రీ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోను ధ‌న‌శ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన గంట‌లోపే ల‌క్ష‌ల సంఖ్య‌లో లైక్స్, వంద‌ల కామెంట్స్ రావ‌డం విశేషం.

ముందుగా శిఖర్ ధావన్‌ బాంగ్రా డ్యాన్స్‌ చేయగా.. అతన్ని అనుసరిస్తూ ధనశ్రీ వర్మ డ్యాన్స్‌ చేసింది. ఇద్దరూ కలిసి 4-5 స్టెప్పులు ఇరగదీశాడు. కొరియోగ్రాఫ‌ర్ అయిన ధనశ్రీ.. ధావ‌న్‌ను అనుకరించడం విశేషం. భారత్, ఇంగ్లండ్ సిరీస్ సంద‌ర్భంగా చహ‌ల్‌తోనే ఉన్న సంద‌ర్భంలో ధ‌న‌శ్రీ ఈ డ్యాన్స్ వీడియో చేసింది. ఇదివరకే టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి‌ ధనశ్రీ డాన్స్ చేసిన విషయం తెలిసిందే. 'రోసెస్' సాంగ్‌కు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులు ఇరగదీశారు. కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ కంటే కూడా శ్రేయస్‌ బాగా వేశాడు.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఫామ్‌లోకి వచ్చిన శిఖర్ ధావన్‌.. ఐపీఎల్‌ 2021 సీజన్‌కు సిద్ధమయ్యాడు. వన్డే సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి 169 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ధావన్‌ నూతనోత్సాహంతో బరిలోకి దిగనున్నాడు. ఏప్రిల్ 9 నుంచి జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 సందడి షురూ అయింది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశిస్తున్నారు

ముంబైలో జన్మించిన ధనశ్రీ వర్మ మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. అంతేకాకుండా తాను ఓ యూట్యూబ్ ఛానల్‌ని సైతం నడుపుతుంది. ఆమె తండ్రి సాగర్ వర్మ వ్యాపార వేత్త. తల్లి వర్ష వర్మ డెంటిస్ట్‌. దీంతో తొలుత డాక్టర్ కావాలని ఆశపడిన ధనశ్రీ.. ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు. ఆమె పోస్ట్ చేసిన వీడియో నిమిషాల్లోనే వైరల్ అవుతుంది.

Story first published: Wednesday, March 31, 2021, 15:10 [IST]
Other articles published on Mar 31, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+