అక్కడితో సీన్ కట్: గబ్బర్ సింగ్‌కు కోపమొచ్చింది: డీకే ముందు మోకరిల్లిన ఢిల్లీ డాషింగ్ ఓపెనర్

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో ఢిల్లీ కేపిటల్స్.. మరో విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్‌కత నైట్ రైడర్స్‌పై తిరుగులేని విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా ఈ సీజన్‌ను ఆరంభించిన ఢిల్లీ కేపిటల్స్.. దానికి తగినట్టుగా ఆటతీరును కనపరుస్తోంది. ఫామ్‌ కోల్పోయిన కోల్‌కత నైట్ రైడర్స్‌తో గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురవారం రాత్రి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసింది. కోల్‌కత నిర్దేశించిన 157 పరుగుల టార్గె‌ట్‌ను ఇంకా 21 బంతులు ఉండగానే ఛేదించింది.

ఢిల్లీ కేపిటల్స్‌కు ఇది అయిదో విక్టరీ. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లను ఆడిన ఆ జట్టు.. రెండింట్లో ఓడిపోయిందంతే. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచుల్లో పరాజయాన్ని చవి చూసింది. అయిదు విజయాలతో మొత్తం 10 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న ఢిల్లీ కేపిటల్స్.. తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్.. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది.

గురువారం రాత్రి నాటి మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ కేపిటల్స్ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్, కోల్‌కత నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మధ్య చోటు చేసుకున్న ఓ సీన్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోల్‌కత నైట్ రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌‌ను షాట్ ఆడటానికి ప్రయత్నించిన శిఖర్ ధవన్ దాన్ని మిస్ అయ్యాడు. బంతి కాస్తా దినేష్ కార్తీక్ గ్లౌస్‌లో వాలింది. వెంటనే అతను బెయిల్స్‌ను ఎగురగొట్టాడు.

అతను క్రీజ్‌ నుంచి కదలకపోవడం.. దినేష్ కార్తీక్‌ను అసహనానికి గురి చేసినట్టయింది. శిఖర్ ధవన్‌పై ఫైర్ అయ్యాడు. ఎడమ చేతిని గాల్లోకి విసురుతూ ఆవేశంగా ఏదో చెప్పాడు. దీనితో శిఖర్ ధవన్ మోకాళ్లపై కూలబడ్డాడు. వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఈ హైఓల్టేజ్ సీన్‌ను చూసిన ఫీల్డ్ అంపైర్ వారిని వారించడానికి పరుగెత్తుకుని రావడం కనిపించింది. ఆ వెంటనే దినేష్ కార్తీక్.. వికెట్ల వెనక్కి చేరడం.. వరుణ్ చక్రవర్తి నెక్స్ట్ బాల్‌ను ఎదుర్కొనడానికి గబ్బర్ సింగ్ బిజీ కావడంతో ఈ సీన్ అక్కడితె కట్ అయింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 30, 2021, 9:01 [IST]
Other articles published on Apr 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X