For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. జైస్వాల్, ఉనద్కట్ ఇన్! ఒక మార్పుతో కేకేఆర్!

IPL 2021, RR vs KKR: Rajasthan Royals won the toss and opted to field, Yashasvi Jaiswal comes in

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా మరోకొద్ది సేపట్లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. శాంసన్ తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. యశస్వి జైస్వాల్, జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చారు. మరోవైపు కోల్‌కతా సారథి ఇయాన్ మోర్గాన్.. శివం మావిని జట్టులోకి వచ్చాడు.

ఐపీఎల్‌లో కోల్‌కతా, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 12 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందగా.. 10 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఇంకా ఆసక్తిరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు జట్లు తలపడిన ఏ మ్యాచ్‌లోనూ ఇప్పటి వరకూ 200 పరుగుల స్కోరు నమోదవలేదు. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్‌తో రెండు మ్యాచ్‌లాడిన కోల్‌కతా రెండింటిలోనూ విజయం సాధించింది.

తుది జట్లు:
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/కీపర్), శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

కోల్‌కతా: నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్‌ కార్తిక్‌, సునీల్‌ నరైన్‌, అండ్రీ రసెల్‌, పాట్‌ కమిన్స్‌, వరుణ్‌ చక్రవర్తి, శివం మావి, ప్రసిద్ధ కృష్ణ.

Story first published: Saturday, April 24, 2021, 19:20 [IST]
Other articles published on Apr 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+