
133 పరుగులకే..
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులే చేయగలిగింది. ఈ మాత్రం పరుగుల కోసం తొమ్మిది వికెట్లను కోల్పోయింది. కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ డైమండ్ డక్ సాధించాడు. ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉండి రనౌట్ అయ్యాడు. ఓపెనర్ నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, మిడిలార్డర్‌లో దినేష్ కార్తీక్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ సాధించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లను పడగొట్టాడు.

ఇవాన్ మోర్గాన్ కేప్టెన్సీలో..
గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్్ 2020 సీజన్ మధ్యలో కోల్‌కత నైట్ రైడర్స్ కేప్టెన్‌గా పగ్గాలను అందుకున్నాడు ఇవాన్ మోర్గాన్. అప్పటిదాకా ఆ టీమ్‌కు దినేష్ కార్తీక్ నాయకత్వాన్ని వహిస్తూ వచ్చాడు. అతని సారథ్యంలో జట్టు పరాజయం పాలవుతోందని భావించిన ఫ్రాంఛైజీ.. అర్ధాంతరంగా వేటు వేసంది. ఇవాన్ మోర్గాన్‌కు కేప్టెన్సీని అప్పగించింది. సీజన్ మధ్యలో కేప్టెన్‌ను మార్చడం వల్ల ఉపయోగం ఉండబోదంటూ విమర్శలు వెల్లువెత్తినప్పటికీ.. పట్టించుకోలేదు.

నాటి పరాజయాలు.. ఇప్పటికీ..
నిజానికి- మోర్గాన్ మామూలోడు కాదు. అతని కేప్టెన్సీలోనే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.. ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. ఎంత ఒత్తిడికి గురైతే.. అంత చెలరేగిపోయి ఆడుతుంటాడీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. ప్రతికూల పరిస్థితుల్లో జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మోర్గాన్‌కు జట్ట సారధ్య బాధ్యతలను అప్పగించింది షారుఖ్ ఖాన్ ఫ్రాంఛైజీ. ఐపీఎల్‌ో మాత్రం మోర్గాన్ మంత్రం పనిచేయనట్టే కనిపిస్తోంది. గత ఏడాది ఆరంభమైన పరాజయాల పరంపర.. ఇప్పుడు కూడా వెంటాడుతోందా జట్టుకు.

12 మ్యాచుల్లో..
ఇవాన్ మోర్గాన్ కేప్టెన్సీలో కోల్‌కత నైట్ రైడర్స్ జట్టు ఇప్పటిదాకా డజను మ్యాచ్‌లను ఆడింది. ఇందులో ఓటములే అధికం. ఈ 12 మ్యాచుల్లో నాలుగింట్లో మాత్రమే నైట్ రైడర్స్ విజయాన్ని రుచి చూశారు. మోర్గాన్ కేప్టెన్‌గా నియమితుడైన తరువాత తొలి మ్యాచ్‌ను ఓడిపోయింది. రెండ మ్యాచ్‌లో గెలుపొందింది. మూడు, నాలుగు మ్యాచుల్లోనూ ఇవే తరహా ఫలితాలొచ్చాయి. ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచుల్లో రెండు పరాజయాలు.. రెండు విజయాలను అందుకుంది. చివరి నాలుగు మ్యాచ్‌లనూ ప్రత్యర్థి జట్టుకు ధారదాత్తం చేసుకుంది.

అచ్చిరాని ముంబై పిచ్..
ముంబైలోని వాంఖెడే పిచ్..కోల్‌కత నైట్ రైడర్స్‌కు ఏ మాత్రం అచ్చిరావట్లేదు. 2008 నుంచి రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ వరకూ 11 సార్లు పరాజయాన్ని చవి చూసింది. ఇందులో తొమ్మిది సార్లు ముంబై ఇండియన్స్‌పై ఓడిపోయింది. చివరి రెండు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న మోర్గాన్ టీమ్.. ప్లేఆఫ్ రేసులో నిలవాలీ అంటే.. ప్రతి మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన స్థితిని ఎదుర్కొంటోంది.


Click it and Unblock the Notifications












