Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: క్రికెట్‌ ఆడాలనే నా డ్రీమ్‌ నెరవేర్చుకున్నా.. ఇంకోటి మాత్రం అలానే ఉండిపోయింది: రోహిత్

IPL 2021: Rohit Sharma wears shoes with Save the rhino message in MI vs RCB match

చెన్నై: చెపాక్ మైదానం వేదికగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన థ్రిల్లింగ్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఘనంగా ఆరంభమైంది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణి చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (19: 15 బంతుల్లో 1x4, 1x6) తక్కువ పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌తో జరిగిన మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్‌ ఒక విషయంలో మాత్రం అభిమానుల​ మనసులు గెలుచుకున్నాడు.

సేవ్‌ ది రైనోస్:

ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఆడేందుకు మైదానంలోకి వస్తున్న సమయంలో మైదానంలోని కెమెరాలు‌ రోహిత్‌ శర్మ షూను పదేపదే చూపించాయి. రోహిత్‌ వేసుకున్న షూపై 'సేవ్‌ ది రైనోస్‌' అని రాసి ఉంది. 'సీఇంగ్ పాసిబులిటీస్' అని మరో షూపై రాసుంది. రెండు షూలపై రైనోస్‌ బొమ్మలు ప్రింట్ చేసి ఉన్నాయి. మొదటగా సేవ్‌ ది రైనోస్‌ అని సరిగా కనిపించకపోవడంతో అభిమానులు కాస్త తికమక పడ్డారు. అసలు విషయం తెలుసుకున్నాక అందరూ రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ తన ట్విటర్‌లో ఈ విషయంపై స్పందించాడు.

ఆట కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చా:

ఆట కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చా:

'నేను నిన్న మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు.. ఆట కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. క్రికెట్‌ ఆడడం అనేది నాకు డ్రీమ్‌. దానిని నెరవేర్చుకున్నా. కానీ ప్రకృతిని కాపాడలనేది మన బాధ్యత. అందరం కలిసికట్టుగా పోరాడితే.. కచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. మన దేశంలో ఇండియన్‌ రైనోలు అంతరించే స్థితికి చేరుకున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనది. మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే నా షూపై అలా రాసుకున్నా' అని రోహిత్ శర్మ రెండు ట్వీట్లు చేశాడు. రోహిత్‌ ఇచ్చిన మెసేజ్ నెటిజన్లు మనసు దోచుకుంది.

మంచి జరగాలని కోరుకుందాం:

మంచి జరగాలని కోరుకుందాం:

ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ... 'టోర్నీలో ఆరంభ మ్యాచ్‌ గెలవడం కీలకం. ఆఖరి వరకు పోరాడాం. మాకు లభించిన శుభారంభం చూస్తే మేం కనీసం మరో 20 పరుగులు చేయాల్సింది. కొన్ని తప్పులు చేశాం. అది సహజమే. మార్కో జాన్సన్‌ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్‌ చేయగల ప్రతిభాశాలి. డివిల్లియర్స్, క్రిస్టియన్ భాగస్వామ్యం విడదీయడం మాకు కీలకం. అందుకే బుమ్రా, బౌల్ట్‌ను ప్రయోగించాం. కానీ ఆ వ్యూహం పనిచేయలేదు. ఏబీ అద్భుతంగా ఆడాడు. కొత్త ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా ఉండటంతో వారి గురించి తెలుసుకోలేకపోయాం. తటస్థ వేదికల్లో ఆడటం ఎవరికైనా సవాలే. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మంచి జరగాలని కోరుకుందాం' అని అన్నాడు.

రోహిత్ రనౌట్:

రోహిత్ రనౌట్:

‌ముంబై ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వేశాడు. చహల్ విసిరిన చివరి బంతిని పాయింట్, కవర్స్ ఫీల్డర్ల మధ్యలో నుంచి ‌లిన్ హిట్ చేశాడు. లిన్ పరుగు కోసం పిలవగానే.. రోహిత్ వేగంగా పిచ్ మధ్యలోకి పరుగెత్తకుంటూ వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతిని డైవ్ చేస్తూ అడ్డుకున్నాడు. దీంతో లిన్.. రోహిత్‌ని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. అప్పటికే చాలా దూరం వెళ్లిపోయిన రోహిత్ మళ్లీ క్రీజులోకి వెళ్లలేకపోయాడు. బంతిని అందుకున్న కోహ్లీ చాకచక్యంగా బౌలర్ చహల్‌కి అందివ్వడంతో.. అతడు వికెట్లను గిరాటేశాడు. దీంతో రోహిత్ రనౌటయ్యాడు.

Story first published: Saturday, April 10, 2021, 20:20 [IST]
Other articles published on Apr 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+