
సెల్ఫీ దిగుతున్నట్లు పోజులు:
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రియాన్ పరాగ్ బౌండరీ లైన్ వద్ద రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. క్యాచ్ పట్టగానే ఆ పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ తెవాటియాని పిలవడం.. అతను తనని సమీపిస్తున్న సమయంలో ఓ మొబైల్ ఫోన్‌ని జేబులో నుంచి తీసి తెవాటియాకి విసురుతున్నట్లు రియాన్ యాక్షన్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బంతితో సెల్ఫీ దిగుతున్నట్లు మైదానంలో పోజులిచ్చారు. కోల్‌కతా ఆటగాళ్లు రాహుల్ త్రిపాఠి, ఆండ్రీ రసెల్ ఔటైనప్పుడు.. పరాగ్, తెవాతియాలు ఈ విధంగా చేయడం వైరల్‌గా మారింది. వీరి ఫోజు చూసిన నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. 'ఇది మరి ఓవరాక్షనే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక్కోరు ఒక్కోలా సెలబ్రేషన్స్:
క్రికెట్ ఆటలో సెంచరీ, క్యాచ్, వికెట్ తీసినప్పుడు ఒక్కోరు ఒక్కోలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు.టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ క్యాచ్ పట్టిన ప్రతిసారి తొడ కొడుతుండగా..వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో వికెట్ తీసినప్పుడు డ్యాన్స్ చేస్తుంటాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కూడా ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పుడు మైదానంలో డ్యాన్స్ చేస్తుంటాడు. విండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ వికెట్ తీసిన ప్రతిసారి సెల్యూట్ కొడుతుంటాడు. ఇటీవల కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. బౌండరీ లైన్ వద్ద క్లిష్టమైన క్యాచ్‌ని పట్టినప్పుడు ఎవరికో ఫోన్ చేస్తున్నట్లు సైగలు చేశాడు.
రెండో విజయం:
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (26 బంతుల్లో 36; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. రాజస్థాన్ బౌలర్లలో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' క్రిస్ మోరిస్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాయల్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (42 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు కోల్‌కతాకు ఇది నాలుగో ఓటమి.


Click it and Unblock the Notifications












