KKR vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ.. ఇద్దరు ప్లేయర్స్ ఆరంగేట్రం!కేకేఆర్‌లోకి అయ్యర్ ఎంట్రీ!

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరోకొద్ది సేపట్లో అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆర్‌సీబీ తరఫున ఇద్దరు ప్లేయర్స్ ఆరంగేట్రం చేస్తున్నారు. కెఎస్ భరత్, వానిందు హసరంగా బెంగళూరు తరఫున తమ మొదటి మ్యాచ్ ఆడుతున్నారు. మరోవైపు కేకేఆర్ తరఫున వెంకటేశ్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. సచిన్ బేబీ కూడా కోల్‌కతా జట్టులో చోటు దక్కించుకున్నాడు. విరాట్‌ కోహ్లీకి ఇది 200వ ఐపీఎల్‌ మ్యాచ్ కావడం విశేషం. ఒక ప్రాంచైజీ తరఫున ఇన్ని మ్యాచులు ఆడిన తొలి బ్యాట్స్‌మన్‌ కోహ్లీనే.

ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లాడి రెండు విజయాలు సాధించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్.. ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఆశలు పెట్టుకోవాలంటే తమకు మిగిలిన ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాలి. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న పోరు కోల్‌కతాకు కీలకం కానుంది. మరోవైపు ఫస్టాఫ్‌లో ఏడు మ్యాచ్‌లాడి ఐదు విజయాలతో పట్టికలో మంచి స్థానంలో ఉన్న బెంగళూరు దూకుడు కొనసాగించాలని భావిస్తోంది. మొత్తానికి సెకండ్ ఫేజ్‌ను ఇరు జట్లు గెలుపుతో స్టార్ట్ చేయాలని భావిస్తుండటంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే నా చివరి సీజన్ అని విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకోవడంతో.. జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇరు జట్ల మధ్య ఫస్టాఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేననే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ (78), ఏడీ డివిలియర్స్ (76 నాటౌట్) హాఫ్ సెంచరీలు బాదారు.

అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం పిచ్ నెమ్మదైనది. మ్యాచ్ జరుగుతున్నా కొద్ది బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారుతుంది. ఈ మైదానంలోని సగటు స్కోర్ 150. అయితే గతేడాది పిచ్‌లో పెరుగుదల కనిపించింది. యావరేజ్‌గా 170 స్కోర్ నమోదైంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపాయి. ఈ మ్యాచుకు ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం 30 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది ఉష్ణోగ్రత తగ్గనుంది. తీవ్ర ఉక్కపోతలో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరికానున్నారు. తేమ ప్రభావం కూడా ఉండనుంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.

తుది జట్లు:
కోల్‌కతా నైట్‌రైడర్స్: నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, లూకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తీ, ప్రసిధ్ కృష్ణ.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, వానిందు హసరంగా, సచిన్ బేబీ, కైల్ జెమీసన్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.

KKR vs RCB: బిగ్ ఫైట్.. కోహ్లీ సేన జోరు కొనసాగెనా? కోల్‌కతా పుంజుకునేనా? తుది జట్లు ఇవే!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 20, 2021, 19:18 [IST]
Other articles published on Sep 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X