For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. పాటిదార్, ఉనద్కత్ ఔట్! గోపాల్ వచ్చేశాడు!

IPL 2021, RCB vs RR: Royal Challengers Bangalore opted to bowl, Shreyas Gopal, Kane Richardson in

ముంబై: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్ జట్లు మరొకొద్ధి సేపట్లో ముంబైలోని వాంఖడే మైదానంలో ఐపీఎల్ 2021‌లోని 16వ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పాటిదార్ స్థానంలో రిచర్డ్సన్‌ను తీసుకున్నట్టు కోహ్లీ చెప్పాడు. మరోవైపు రాజస్థాన్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. జయదేవ్ ఉనద్కత్ స్థానంలో శ్రేయస్ గోపాల్ వచ్చాడు.

మూడు విజయాలతో జోరుమీదున్న కోహ్లీసేనను పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న సంజు సేన ఎలా అడ్డుకుంటారో చూడాలి. నిలకడ లోపించిన రాజస్థాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లో నెగ్గి ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సి ఉంది. ఇక బెంగళూరు ఆటపై పూర్తి ఆధిపత్యం సాధించి తొలి స్థానాన్ని సంపాదించేందుకు సమాయత్తమవుతోంది. ఈ సీజన్‌లో ముంబై వేదికగా ఆర్‌సీబీకి ఇదే ఫస్ట్ మ్యాచ్ కాగా.. రాజస్థాన్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇది కోహ్లీసేనకు ప్రతీకూలం కానుంది.

ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు, రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకూ 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో మూడుమ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా.. మిగిలిన 20 మ్యాచ్‌లకిగానూ చెరో 10 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో రెండు సార్లు ఈ జట్లు తలపడగా.. రెండు మ్యాచుల్లోనూ బెంగళూరు టీమ్ విజయం సాధించింది. భీకరమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న బెంగళూరుపై రాజస్థాన్‌ బౌలర్లందరూ సమష్టిగా పోరాడితేనే గెలుపు దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

జట్లు:
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షెబాజ్ అహ్మద్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీసన్, కేన్ రిచర్డ్సన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.
రాజస్థాన్: జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజూ శాంసన్ (కెప్టెన్/కీపర్), శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, శ్రేయస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

Story first published: Thursday, April 22, 2021, 19:19 [IST]
Other articles published on Apr 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+