న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ముంబైతో మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి గట్టి షాక్.. స్టార్ పేసర్‌కు కరోనా!

IPL 2021: RCB Player Daniel Sams tests positive for COVID-19 ahead of season opener
IPL 2021 : RCB All-Rounder Daniel Sams Tests Positive For Covid-19 || Oneindia Telugu

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌( ఐపీఎల్) 2021 సీజన్‌ను కరోనా వైరస్ నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు, సిబ్భంది వరుసగా కరోనా బారిన పడుతూ వస్తున్నారు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పేసర్ డానియల్ సామ్స్‌కు కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన డానియల్‌ సామ్స్‌ ఏప్రిల్‌ 3న నెగెటివ్‌ రిపోర్టుతో బెంగళూరు క్యాంప్‌కు చేరుకున్నాడని, అతనికి చేసిన రెండో పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్టు ఆర్‌సీబీ ట్వీట్ చేసింది.

 సెకండ్ టెస్ట్‌లో..

సెకండ్ టెస్ట్‌లో..

'డానియల్ సామ్స్ ఏప్రిల్ 3న కరోనా నెగటివ్ రిపోర్ట్‌తో చెన్నై చేరుకున్నాడు. అయితే ఏప్రిల్ 7న అతనికి నిర్వహించిన రెండో పరీక్షల్లో పాజిటీవ్ అని తేలింది. ప్రస్తుతం సామ్స్‌కు ఎలాంటి లక్షణాలు లేవు. బీసీసీఐ నిబంధనల మేరకు అతన్ని ఐసోలేషన్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశాడు. మా మెడికల్ టీమ్ నిరంతరం సామ్స్‌ను పర్యవేక్షిస్తుంది. బీసీసీఐ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాం'అని ట్వీట్ చేసింది.

సజావుగా సాగెనా?

సజావుగా సాగెనా?

ఐపీఎల్‌కు మరో రెండు రోజుల సమయమే ఉండగా.. ఆయా జట్ల ఆటగాళ్లు, సిబ్బంది వరుసగా కరోనా బారిన పడటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌లో అక్షర్‌ పటేల్‌, బెంగళూరులోనే దేవదత్‌ పడిక్కల్‌కు పాజిటివ్‌ వచ్చింది. మళ్లీ నెగెటివ్‌ రావడంతో పడిక్కల్‌ ఆర్‌సీబీ క్యాంప్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కోల్‌కతా ఆటగాడు నితీశ్‌ రాణా కూడా కరోనా నుంచి కోలుకొని జట్టుతో కలిశాడు.

ముంబై ఇండియన్స్‌ సలహాదారు కిరణ్‌ మోరెకు సోమవారమే వైరస్‌ సోకింది. ముంబైలోని వాంఖడే మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో వైరస్‌ బారిన పడ్డారు. అంతేకాకుండా మ్యాచులను ప్రసారం చేసే స్టార్‌స్పోర్ట్స్‌ సిబ్బందిలో చాలామందికి పాజిటివ్‌ రావడంతో లీగ్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి.

పాపం ఆర్‌సీబీ..

పాపం ఆర్‌సీబీ..

అయితే బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాత్రం షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. గత సీజన్‌లో కూడా ఇలాంటి ఆటంకాలు ఏర్పడ్డాయని, ఇవన్నీ సహజమేనని పేర్కొన్నాడు. ఇక ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరగనున్న ఈ మెగాలీగ్‌లో ఆరంభ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుల మధ్య జరుగునుంది. అయితే ఇప్పటికే బలహీనమైన బౌలింగ్ విభాగంతో ఉన్న ఆర్‌సీబీ.. డానియల్ సామ్స్ సేవలు కోల్పోవడం తలనొప్పిగా మారింది.

ఇక డానియల్ సామ్స్‌ను ఆర్‌సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం డానియల్ సామ్స్ 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ లెక్కన అతను ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

Story first published: Wednesday, April 7, 2021, 11:58 [IST]
Other articles published on Apr 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X