IPL 2021:ఐపీఎల్ కప్ బదులుగా..విస్కీ గోబ్లెట్ కప్ పెట్టాలని ఆర్‌సీబీ పిటిషన్ వేస్తుందేమో?!వచ్చేసారి కప్ మాదే!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో షార్జాలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌లో నిరాశపరిచిన బెంగళూరు టీమ్.. ఆపై బౌలింగ్‌లో పర్వాలేదనిపించినా ఆ ప్రదర్శన సరిపోలేదు. దాంతో ఐపీఎల్ టోర్నీలో మొదటి టైటిల్ గెలుచుకోవాలనే ఆర్‌సీబీ కల మరోసారి చెదిరిపోయింది. విరాట్ కోహ్లీ 9 సంవత్సరాల పాటు జట్టుకు నాయకత్వం వహించి.. ఆర్‌సీబీని ఛాంపియన్ నిలపడంతో విఫలమయ్యాడు. కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ కెప్టెన్‌గా కోహ్లీకి చివరి మ్యాచ్‌గా ముగిసింది.

 పాత కథే పునరావృతం:

పాత కథే పునరావృతం:

ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతున్న విరాట్ కోహ్లీ.. 2013లో డానియల్ వెటోరీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఫ్రాంచైజీతోనే ఉన్న కోహ్లీ.. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆర్‌సీబీకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్​ ఉందనడానికి కారణం కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కోహ్లీ ఆర్‌సీబీకి ఒక్క కప్ కూడా అందించలేదు. 2016లో జట్టుని ఫైనల్‌కి చేర్చి టైటిల్‌ విజేతగా నిలిపేలా కనిపించాడు. కానీ ఆ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓడిపోయింది. ఆ తర్వాత మూడు సీజన్లలో తేలిపోయిన ఆర్‌సీబీ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో అలవోకగా ప్లే ఆఫ్స్‌కి చేరింది. కానీ మళ్లీ అదే పాత కథ పునరావృతం అయింది.

 70 మ్యాచ్‌లు ఓడిపోయింది:

70 మ్యాచ్‌లు ఓడిపోయింది:

ఐపీఎల్ 2021 రెండవ సీజన్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. అయితే భవిష్యత్తులో తాను ఆర్‌సీబీలోనే కొనసాగాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. క్రికెట్ ఆడినంతకాలం బెంగళూరుకే ఆడతనాన్ని కూడా కుండబద్దలు కొట్టాడు. అప్పటి నుంచి అభిమానులు, ఆర్‌సీబీ బృందం తమ కెప్టెన్‌కు ఛాంపియన్‌గా వీడ్కోలు పలకాలని కోరుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. కోహ్లీ కెప్టెన్సీలో ఆర్‌సీబీ ఐపీఎల్ లీగ్‌లో మొత్తం 140 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 66 మ్యాచ్‌లు ఆర్‌సీబీ గెలుపొందగా.. 70 మ్యాచ్‌లు ఓడిపోయింది. మరో నాలుగు మ్యాచుల్లో ఫలితం రాలేదు. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన జాబితాలో కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ కప్ బదులుగా.. విస్కీ గోబ్లెట్ కప్:

ఐపీఎల్ కప్ బదులుగా.. విస్కీ గోబ్లెట్ కప్:

నిజానికి ఇలాంటి ఓటములకి బెంగళూరు ఆటగాళ్లే కాదు.. ఆ టీమ్ అభిమానులు కూడా అలవాటు పడిపోయారు. ఏటా 'ఈసాల కమ్ నమ్‌దే' అంటూ బరిలోకి దిగడం, ఉసూరమనిపించడం ఆర్‌సీబీకి ఓ అలవాటుగా మారిపోయింది. అందుకే ఐపీఎల్ టోర్నీలో ఏ జట్టుకీ లేనన్ని ట్రోల్స్ బెంగళూరు మీదే పేలుతుంటాయి. ముఖ్యంగా టైటిల్, కోహ్లీ సారథ్యంపైనే నెటిజన్లు ట్వీట్లు చేస్తుంటారు. ఇక సోమవారం ఎలిమినేటర్‌లో కోల్‌కతాపై బెంగళూరు ఓడిపోవడంతో నెటిజన్లు మరోసారి విమర్శల దాడి చేశారు. అయితే అవన్నీ ఫన్నీగానే ఉన్నాయి. 'వచ్చేసారి కప్ మాదే' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఐపీఎల్ కప్ బదులుగా.. విస్కీ గోబ్లెట్ కప్ పెట్టాలని ఆర్‌సీబీ ఐపీఎల్ గవర్నెన్స్ కౌన్సిల్‌కు పిటిషన్ రాస్తుందేమో' అని ఇంకొకరు ట్వీటారు. 'ఆర్‌సీబీ రిప్', 'నరైన్ ఎంతపని జేస్తివి', 'ఆర్‌సీబీకి నిరీక్షణ తప్పేలా లేదు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, October 12, 2021, 13:29 [IST]
Other articles published on Oct 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X