Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాట్ ఎ క్యాచ్: కావ్య పాపను కట్టి పడేసిన ప్రత్యర్థి జట్టు ఫీల్డర్‌‌: బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫీట్

IPL 2021: Ravi Bishnois best catch of this season so far, SRHs Kavya Maran tweets

చెన్నై: కావ్య మారన్.. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తాన్నీ తనవైపు తిప్పుకొన్న ఏకైక స్టార్ అట్రాక్షన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఫ్రాంఛైజీగా తన సొంత జట్టు ఆడుతున్న మ్యాచ్‌లో రెగ్యులర్‌గా అటెండ్ అవుతున్నారామె. మ్యాచ్‌లను చూస్తూ తనను తాను మర్చిపోతుంటారు. తన ఎమోషన్స్‌ను ఏ మాత్రం దాచుకోలేకపోతుంటారు. జట్టు గెలిస్తే.. ఎగిరి గంతేయడం, ఓడిపోతే.. కంటనీరు పెట్టుకోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ఆ ఎమోషన్స్‌తోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

తనలోని భావోద్వేగాన్ని కావ్య మారన్ మరోసారి బయటపెట్టుకున్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైన ఓ క్యాచ్ ఆమెను కట్టిపడేసింది. ఆ క్యాచ్ పట్టిన ఫీల్డర్‌ను ఆమె ఆకాశానికెత్తేశారు. ఇలాంటి ఫీట్ ఇప్పటిదాకా చూడలేదంటూ ప్రశంసించారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటిదాకా నమోదైన అన్నింట్లోకి ఇదే అత్యుత్తమ క్యాచ్‌గా ఆమె అభివర్ణించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

ఆ క్యాచ్- పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ పట్టినది. కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ను పెవిలియన్ పట్టించడానికి రవి బిష్ణోయ్ పట్టిన క్యాచ్.. ఆ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కత నైట్ రైడర్స్ వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, నితీష్ రాణా తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. సునీల్ నరైన్ కూడా డకౌట్ అయ్యాడు. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద ఉన్న సమయంలో సునీల్ అవుటయ్యాడు.

అర్ష్‌దీప్ సింగ్ సంధించిన లెంగ్త్ బంతిని డీప్ మిడ్ వికెట్ వైపు భారీ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని రవి బిష్ణోయ్ అందుకున్న తీరు అద్భుతమే. తన కుడివైపు పరుగులు పెట్టి.. గాల్లోకి డైవ్ చేసి మరీ దాన్ని అందుకున్నాడతను. ఆది క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా కావ్య మారన్ ప్రశంసించారు. స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సహా పలువురు మాజీలు రవి బిష్ణోయ్ ఫీట్ పట్ల సర్‌ప్రైజ్ అయ్యారు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్‌గా కాంప్లిమెంట్స్ చేశారు.

Story first published: Tuesday, April 27, 2021, 12:57 [IST]
Other articles published on Apr 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+