హైదరాబాద్: వచ్చే నెల 18న జరగబోయే ఐపీఎల్ 2021 మినీ వేలానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమ దగ్గర ఉన్న కొంతమంది ప్లేయర్స్‌ను వదిలేసిన ఫ్రాంచైజీలు.. ఇప్పుడు ట్రేడింగ్ ద్వారా తమకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ అభిమాని ఒకరు తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టును తమ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ముంబై జట్టుకు ట్రేడింగ్ చేయాలని కోరాడు. ముంబై అభిమానికి రాజస్థాన్ తనదైన శైలిలో పంచ్ ఇచ్చింది.
తాజాగా ముంబై ఇండియన్స్ అభిమాని దలపతి విగ్నేశ్వరన్.. బెన్ స్టోక్స్‌ను ముంబై జట్టుకు ట్రేడింగ్ చేయాలని రాజస్థాన్ రాయల్స్ జట్టును కోరాడు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన రాజస్థాన్ ఫ్రాంచైజీ స్టోక్స్‌ను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇందుకుగాను ఓ ఎమోజీని రీ ట్వీట్ చేసింది. అందులోని వ్యక్తి 'నో-నో' అంటూ తలను అడ్డంగా ఊపుతున్నాడు. రాబోయే సీజన్ కోసం రాజస్థాన్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌ను వదిలేసుకుంది. ఇప్పుడు స్టోక్స్‌ను కూడా వదిలేస్తే ఆ జట్టుకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది.
ముంబై ఇండియన్స్‌కు ముగ్గురు పటిష్ఠమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. కిరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో బలమైన మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అలాంటప్పుడు ఆ జట్టు బెన్ స్టోక్స్‌ను కొనుగోలు చేసే అవసరం లేదు. ఇప్పటికే జట్టులో ఉన్న కొంతమంది బెంచ్‌కే పరిమితమవుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్లో స్టోక్స్ అన్ని మ్యాచ్‌లూ ఆడలేకపోయాడు. టోర్నీకి ఆలస్యంగా రావడంతో 8 మ్యాచ్‌లే ఆడాడు. మొత్తం 285 పరుగులు చేశాడు. ముంబైతో తలపడిన మ్యాచ్‌లో శతకం (107; 60 బంతుల్లో 14x4, 3x6)తో కదం తొక్కాడు.
Trade ben stokes to MI @mipaltan
— Thalapathy Vigneshwaran (@Vigneshwaran908) January 25, 2021
భారత్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం బెన్ స్టోక్స్ భారత్‌కు వచ్చాడు. కరోనా కారణంగా స్టోక్స్ నగరంలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉన్నాడు. మొదటి రోజు గడిచిపోయింది. మిగతా ఐదు రోజులను ఎలా గడపాలనేదానిపై తన కార్యాచరణ ప్రణాళికను ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించాడు. లంక పర్యటనను ముగించుకున్న ఇంగ్లాండ్ జట్టు బుధవారం చెన్నై వచ్చే అవకాశం ఉంది. జట్టు సభ్యులంతా ఆరు రోజులు క్వారంటైన్లో ఉంటారు. ఫిబ్రవరి 2 నుంచి ఇంగ్లీష్ ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ఆరంభంకానుంది.
పంత్ క్రీజులో నిలదొక్కుకుంటే.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను లాక్కొస్తాడు: రహానే