Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs KKR: షారుక్‌ ఐకానిక్‌ పోస్టర్‌తో.. కేకేఆర్‌ను టీజ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌!!

IPL 2021: Rajasthan Royals trolls Kolkata Knight Riders with Shahrukh Khans Iconic Pose

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్‌ (కేకేఆర్‌)కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. టోర్నీలో ఇప్పటికి ఐదు మ్యాచులు ఆడగా.. నాలుగు ఓట‌ముల‌ను చవిచూసింది. ముంబైలోని వాంఖడే మైదానంలో శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జరిగిన మ్యాచులోనూ ఓడిపోయింది. ఈ విజయంతో రాజస్తాన్‌ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరగా.. కేకేఆర్‌ మాత్రం వరుస పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ త‌ర్వాత రాయ‌ల్స్ టీమ్ నైట్‌రైడ‌ర్స్‌ను ఓ ఫ‌న్నీవీడియోతో టీజ్ చేసింది.

కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్‌ టీమ్ కో ఓన‌ర్, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఐకానిక్ పోజును రాజస్థాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్ కాపీ కొడుతున్న వీడియోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సూప‌ర్‌ హిట్ మూవీ 'దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయేంగే'లోని మ్యూజిక్ ప్లే చేస్తూ ఈ వీడియో పోస్ట్ చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం మ్యాచ్ గెలిచిన త‌ర్వాత రాయ‌ల్స్ మూడ్ ఇలా ఉందంటూ కామెంట్ చేసింది. షారుఖ్‌ నటించిన దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలోని షారుఖ్‌ నిల్చుని రెండు చేతులతో ఫోజిస్తూ నవ్వుతూ ఉండే ఐకాన్‌ ఫోటో అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. అచ్చం అదే మాదిరిగా రాజస్తాన్‌ ఆటగాళ్లు ఫోజు ఇస్తూ నిల్చున్నారు.

మ్యాచ్ ఓడినా, గెలిచినా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్ర‌తిసారీ ఇలాంటి ఫ‌న్నీ మీమ్స్‌, వీడియోల‌తో త‌మ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఒక్కోసారి తమపై కూడా సెటైర్లు వేసుకుంటుంది రాయ‌ల్స్. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. డెత్‌ ఓవర్లలో క్రిస్ మోరిస్‌ విజృంభించడంతో కేకేఆర్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాహుల్‌ త్రిపాఠి 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దినేశ్‌ కార్తిక్‌ 25 పరుగులు చేశాడు.134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సంజు శాంసన్ 42 పరుగులతో రాణించగా.. మిల్లర్‌ 24 పరుగులు చేశాడు.

Story first published: Sunday, April 25, 2021, 18:06 [IST]
Other articles published on Apr 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+