IPL 2021: ఇది పక్కా.. రోహిత్ శర్మ ఆరోసారీ ఐపీఎల్ టైటిల్ గెలుస్తాడు: చహర్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆరోసారి టైటిల్‌ని గెలుస్తాడని ఆ జట్టు యువ స్పిన్నర్ రాహుల్ చహర్ జోస్యం చెప్పాడు. ముంబై ఆటగాళ్లు ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారని, రోహిత్ సిక్సర్ బాదేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చెన్నైలోని చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్ ఢీకొట్టనుంది.

రోహిత్ భయ్యా సిక్సర్ కొట్టేస్తాడు:
తొలి మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతున్న రాహుల్ చహర్.. తమ జట్టు గురించి మాట్లాడాడు. 'ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి రాణించేందుకు ఎదురుచూస్తున్నా. మాకు మంచి కోచింగ్ బృందం ఉంది. జహీర్ ఖాన్, మహేళ జయవర్దనే వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకోవడం నా అదృష్టం. ముంబై ఆరో టైటిల్ కొడుతుందన్న నమ్మకం ఉంది. మా బ్యాట్స్‌మెన్ ఉత్తమ ఫామ్‌లో ఉన్నారు. రోహిత్, హార్దిక్, కృనాల్, సూర్యకుమార్, ఇషాన్‌తో జట్టు దుర్భేద్యంగా ఉంది. వరుసగా మూడోది, మొత్తంగా ఆరో ట్రోఫీ అందుకోవడంలో సందేహమే లేదు. టైటిళ్లతో రోహిత్ భయ్యా సిక్సర్ కొట్టేస్తాడు' అని అన్నాడు.

అదే నా కోరిక:
'రోహిత్, హార్దిక్, పొలార్డ్ మా జట్టులో స్టార్ ఆటగాళ్లు. ఏ పరిస్థితుల్లోనైనా వారు ఆటను మార్చేస్తారు. ఈ ముగ్గురే కాకుండా సూర్య, ఇషాన్ మాకు కీలకం. వారిప్పుడు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఏడాదిన్నర తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశా. కొన్ని విభాగాల్లో నా ఆటను మెరుగుపర్చుకుంటున్నా. భారత్‌కు మూడు ఫార్మాట్లలో ఆడాలన్నది నా కోరిక. జహీర్ ఖాన్ సర్ నా బౌలింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు' అని స్పిన్నర్ రాహుల్ చహర్ చెప్పాడు.

ఇప్పటికే ఐదు టైటిల్స్:
ఐపీఎల్‌లో వరుసగా 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా టైటిల్ కొడితే హ్యాట్రిక్ ముంబై ఖాతాలో చేరనుంది. ఇక చివరి రెండు సీజన్లలోనూ ముంబై టైటిల్ గెలవడంలో రాహుల్ చహర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన చహర్.. పొదుపుగా బౌలింగ్ చేసి 15 వికెట్లు పడగొట్టాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి కీలకమైన వికెట్లని పడగొట్టి మ్యాచ్‌లను మలుపు తిప్పడంలో చహర్ దిట్ట.

మోరేకు కరోనా:
ముంబై ఇండియన్స్ జట్టు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ మోరేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన ఫ్రాంఛైజీ మంగళవారం ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసి మరీ అందరికీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లోనే అందరికి నెగెటివ్ వచ్చింది. దీంతో ముంబై ప్రాంచైజీ ఊపిరిపీల్చుకుంది. బీసీసీఐ రూపొందించిన ఆంక్షలు, నిబంధనలను తాము అత్యంత కఠినంగా అమలు చేస్తున్నామని ముంబై వెల్లడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications