
సన్‌రైజర్స్‌కు చేదు అనుభవం
ఈ సీజన్ ఐపీఎల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొరుకుడు పడలేదు. ఎన్నిరకాలుగా విజయాలను సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవేవీ సక్సెస్ కాలేదు. సీజన్ మొదటి నుంచీ వరుస పరాజయాలను చవి చూస్తూ వచ్చింది ఆరెంజ్ టీమ్. కేప్టెన్‌ను మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. పైగా జట్టు స్థిరత్వాన్ని కోల్పోయేలా చేసింది. నిలకడను దెబ్బతీసింది. గెలిచి తీరాల్సిన మ్యాచుల్లోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిం

ఎనిమిదో స్థానంలో..
సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ ఐపీఎల్‌లో అట్టడుగు స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదివరకు ఫ్రాంఛైజీ, పేరు మారకముందు డెక్కన్ ఛార్జెస్‌గా ఉన్న సమయంలో తొలి సీజన్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే. 2008లో డెక్కన్ ఛార్జెస్ ఎనిమిదో స్థానంలో నిలవగా.. ఆ తరువాతి సీజన్‌లో ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. 2009లో ఐపీఎల్ టైటిల్ విన్నర్ ఒకప్పటి డీసీ.

స్థానాలు మారాయే తప్ప
ఫ్రాంఛైజీ మారిన తరువాత హైదరాబాదీ టీమ్ 2016లో ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత పాయింట్ల పట్టికలో స్థానాలు మారుతూ వచ్చాయే గానీ.. ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 13 మ్యాచ్‌లను ఆడిన సన్‌రైజర్స్ మూడింట్లో మాత్రమే నెగ్గింది. ఈ సాయంత్రం తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా సరే.. ఎనిమిదో స్థానం నుంచి పైకి లేవలేదు సన్‌రైజర్స్.

ఆ చరిత్రను తిరగరాస్తుందా?
డెక్కన్ ఛార్జెస్‌గా ఉన్న సమయంలో ఈ హైదరాబాదీ టీమ్.. 2008లో చివరి స్థానంలో నిలవగా..ఆ మరుసటి ఏడాది టైటిల్ విన్నర్‌గా ఆవిర్భవించింది. అదే చరిత్రను, సంప్రదాయాన్ని కొనసాగించగలిగితే.. 2022 ఐపీఎల్ ఛాంపియన్ అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. అది ఎంత వరకు సాధ్యపడుతుందనేది తేలాల్సి ఉంది. డేవిడ్ వార్నర్ దాదాపుగా సన్‌రైజర్స్‌ను వీడే అవకాశాలు ఉన్నాయి. అరకొర వనరులు ఉన్న సన్‌రైజర్స్‌కు ఇది పిడుగులాంటిదే అవుతుంది.

2008 నుంచి ఇప్పటిదాకా ఎనిమిదో పొజీషన్‌లో ఉన్న జట్లు ఇవే..
ఐపీఎల్ సీజన్ 2008లో ఆరంభం కాగా.. డెక్కన్ ఛార్జెస్ చివరిస్థానంలో నిలిచింది. ఆ తరువాతి సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, 2011లో ఢిల్లీ డేర్ డెవిల్స్, 2012లో పుణె వారియర్స్ ఇండియా, 2013, 2014ల్లో మళ్లీ ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. 2015, 2016ల్లో మళ్లీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ది అదే పరిస్థితి. 2017లో రాయల్ ఛాలెంజర్స్, 2018 మళ్లీ ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎనిమిదో స్థానంతో తమ ఐపీఎల్ సీజన్లలో ఫినిష్ చేశాయి. 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చిట్టచివరి స్థానంలో నిలవగా.. గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ ఆ స్థానానికి దిగజారింది. ఇక తాజాగా- ఆ డ్యూటీని సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది.


Click it and Unblock the Notifications












