For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు పైలట్ స్పెషల్ అనౌన్స్‌మెంట్! రోహిత్, డికాక్‌లా మనం చేయాలి!!

IPL 2021: Pilot special announcement for Mumbai Indians players

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భారత్‌లో వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌.. వచ్చె నెల నుంచి యూఏఈ, ఒమన్ వేదికలుగా మొదలుకానుంది. సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరుగుతుంది. రెండో దశ ఐపీఎల్‌ పోటీలకు సర్వం సిద్ధమైంది. బీసీసీఐ, యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేశాయి. ఇక ఒక్కో జట్టు యూఏఈ చేరేందుకు రెడీ అవుతున్నాయి. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ దుబాయ్ చేరింది. తాజాగా ముంబై ఇండియన్స్‌ జట్టు యూఏఈ చేరుకున్నది. అయితే ముంబై జట్టుకు పైలట్‌ ఊహించని షాక్ ఇచ్చాడు.

 పైలట్ స్పెషల్ అనౌన్స్‌మెంట్:

పైలట్ స్పెషల్ అనౌన్స్‌మెంట్:

ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు బయల్దేరిన చార్టర్డ్‌ విమానం పైలట్‌.. వినూత్నంగా స్వాగతం పలికే అనౌన్స్‌మెంట్‌ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ముంబై తరఫున ఆడుతున్న ఆటగాళ్ల పేర్లతో కలిపి ఓ అనౌన్స్‌మెంట్‌ చేశాడు. ఇందులో ఆయా ఆటగాళ్ల ప్రత్యేకతలను కూడా తీసుకున్నాడు. 'ముంబై నుంచి అబుదాబికి ఈ చార్టర్ ఫ్లైట్ బయలుదేరింది. మా సర్వీస్‌లో మిమ్మల్ని తీసుకెళ్లడం గౌరవంగా భావిస్తున్నా. ఈ రోజు ఉదయం వర్షాలు కురిశాయి. మనం త్వరగా యూఏఈ చేరుకోవాలి. రోహిత్ శర్మ మరియు క్వింటన్ డికాక్ జట్టు కోసం ఎలా దూకుడుగా ఆడుతారో.. ఇప్పుడు మనం అదే చేయాలి' అని పైలట్‌ అన్నాడు.

45 నిమిషాల ముందుగానే:

45 నిమిషాల ముందుగానే:

'ఫ్లైట్ వివరాల ప్రకారం మనం గాల్లో ఉన్నాం. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాము. ఫ్లైట్ దాదాపు 900 km/h స్పీడ్‌లో దూసుకెళుతోంది. దీంతో మన గమ్యస్థానంకు 45 నిమిషాల ముందుగానే చేరుకుంటాం. కీరాన్ పొలార్డ్ సెంచరీ చేస్తే.. ఇలానే ఉంటుంది కదా. గమ్యస్థానంలో ఉదయం 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. 2017 ప్లేఆఫ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఓవర్ వేసినట్టుగా ప్రశాంతంగా ఉండనుంది' అని ముంబై ఇండియన్స్‌ చార్టర్డ్‌ విమానం పైలట్‌ పేర్కొన్నాడు.

అనౌన్స్‌మెంట్‌ అదిరిపోయింది:

అనౌన్స్‌మెంట్‌ అదిరిపోయింది:

ఏదేమైనా విమానం పైలట్‌ చేసిన అనౌన్స్‌మెంట్‌ మాత్రం అదిరిపోయింది. సిక్సర్లు, ఫోర్లు కొడుతూ.. వికెట్లు తీస్తూ అభిమానులను అలరించే క్రికెటర్లు.. ఏకంగా తమపై విమానం అనౌన్స్‌మెంట్‌ మాదిరిగా పైలట్‌ ప్రకటన చేసి ఆకట్టుకున్నాడు. తన అనౌన్స్‌మెంట్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు కీరన్‌ పోలార్డ్‌, ఇషాంత్‌ కిషన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్, రోహిత్ శర్మ మరియు క్వింటన్ డికాక్ పేర్లతోపాటు వారి ప్రత్యేకతను కలుపుతూ హుషారుగా మాటలు కలిపాడు. భారతదేశం-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న కెప్టెన్ రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ లాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ముంబై ఇండియన్స్ వారి శిక్షణా శిబిరాన్ని అబుదాబిలో ప్రారంభించనున్నది.

8 పాయింట్లతో నాలుగో స్థానంలో:

8 పాయింట్లతో నాలుగో స్థానంలో:

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు తమ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించడానికి ముందు అబుదాబిలో కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. యూఏఈలో ఐపీఎల్ 2020 సందర్భంగా ముంబై ఇక్కడే జరిగిన ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి రికార్డు స్థాయిలో ఐదవ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. ఐపీఎల్‌ 2021లో ముంబై ఇండియన్స్‌ ప్రస్తుతం ఏడు మ్యాచ్‌లు ఆడి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నది. సెప్టెంబర్ 19 న ప్రధాన ప్రత్యర్తి చెన్నై సూపర్ కింగ్స్‌తో ముఖాముఖి పోటీతో సీజన్‌ను తిరిగి ప్రారంభించనున్నారు.

Story first published: Sunday, August 15, 2021, 21:09 [IST]
Other articles published on Aug 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+