Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021 Phase 2: పంజాబ్ కింగ్స్ పించ్ హిట్టర్..వెడ్‌లాక్: ఫియాన్సీతో

IPL 2021 Phase 2: Punjab Kings Nicholas Pooran enters the wedlock with fiancee
Punjab Kings Nicholas Pooran Marries Alyssa Miguel | IPL 2021 || Oneindia Telugu

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ బ్యాటింగ్ వీరుడు, పంజాబ్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, పించ్ హిట్టర్ నికొలస్ పూరన్.. ఓ ఇంటివాడయ్యాడు. తన ఫియాన్సీ అలైసా మిగ్యెల్‌ను పెళ్లి చేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టుబాగో రాజధాని పోర్ట్ ఆప్ స్పెయిన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో తన ఫియాన్సీ వేలికి ఉంగరాన్ని తొడిగాడు. ఐపీఎల్ 2021 ఫేస్ 2కు సంబంధించిన షెడ్యూల్ వెలువడిన రెండోరోజే ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాడతను.

నిజానికి ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకోవాలని తొలుత పూరన్ భావించాడు. ఐపీఎల్ 2021 ఫేస్ 2, కరేబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉన్నందున..వివాహ కార్యక్రమాన్ని ముందుకు జరిపాడు. ఈ రెండు టోర్నమెంట్ల కంటే ముందే ఇంటివాడయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో పూరన్-అలైసా మధ్య ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. ఏడాది తరువాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించినప్పటికీ.. బిజీ షెడ్యూల్ ఉన్నందున అయిదు నెలలు ముందుగానే పెళ్లాడాడు.

ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, తోటి క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్, ముంబై బ్యాటింగ్ వెన్నెముక, వెస్టిండీస్ జట్టు కేప్టెన్ కీరన్ పొలార్డ్ అతన్ని అభినందించారు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న పూరన్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. గయానా అమేజాన్ వారియర్స్ టీమ్‌లో అతను సభ్యుడు. ఈ జట్టు తరఫున అతను సీపీఎల్‌లో రికార్డు నెలకొల్పాడు. 20 ఓవర్ల మ్యాచ్‌లో సెంచరీ బాదాడు.

Story first published: Tuesday, June 1, 2021, 10:29 [IST]
Other articles published on Jun 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+