
సగం టోర్నీ ఇంకా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల వల్ల ఈ ఐపీఎల్ సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ మినహా ఇందులో పాల్గొన్న ఫ్రాంఛైజీలన్నీ ఏడేడు మ్యాచ్‌ల చొప్పున ఆడేశాయి. ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడాయి. అంటే- సగం టోర్నీ ముగిసినట్టే. ఆయా జట్లన్నీ ఇంకా ఏడేడు మ్యాచ్‌ల చొప్పున ఆడాల్సి ఉంది. మిగిలిపోయిన మ్యాచ్‌లను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయంపై బీసీసీఐ అప్పట్లో ఏమీ తేల్చలేదు. ఇప్పుడు కూడా దానిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

టీ20 ప్రపంచకప్ కంటే ముందే..
మరోవంక- ఐసీసీ నిర్వహించబోయే టీ20 ప్రపంచకప్ (ICC T20 world cup) షెడ్యూల్‌పై బీసీసీఐ కసరత్తు చేపట్టింది. గత ఏడాదే ఈ టోర్నమెంట్‌ను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వల్ల ఈ ఏడాదికి వాయిదా వేసుకుంది. అక్టోబర్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెగా ఈవెంట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పూర్తి చేయాలంటూ ఇదివరకే ఓ నిర్ణయానికొచ్చింది బీసీసీఐ. ఎమిరేట్స్‌లో నిర్వహించిన ఐపీఎల్ 2020 సీజన్ విజయవంతం కావడంతో.. ఇక అక్కడే టీ20 ప్రపంచకప్ నిర్వహించాలనేది బీసీసీఐ ప్రధాన ఉద్దేశం.

సెప్టెంబర్ నుంచి
కాగా- అనుకోకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను కూడా ఎమిరేట్స్‌లో కొనసాగించాలని నిర్ణయించింది. దీని షెడ్యూల్ ఎలా ఉండాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం- టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కంటే ముందే- అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 లోపల ఐపీఎల్ 2021 సీజన్‌లో బ్యాలెన్స్ మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ సమాయాత్తమౌతోందని తెలుస్తోంది. దీని తరువాత- ఓ రెండు నుంచి మూడు వారాల విరామం అనంతరం టీ20 ప్రపంచకప్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని బీసీసఐ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

29న బీసీసీఐ కీలక భేటీ
దీనికోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. దీనికి కారణం- ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ (World Test Championship). ఇంగ్లాండ్ వేదికగా డబ్ల్యూటీసీ (WTC) టోర్నీ ఏర్పాటు కానుంది. సుదీర్ఘంగా సాగాల్సి ఉన్న టోర్నీ ఇది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌కు కొద్దిగా కుదించుకోవాలని బీసీసీఐ.. ఈసీబీని కోరుతోంది. దీనివల్ల సెప్టెంబర్ 15 నాటికి ఐపీఎల్ 2021 సీజన్ ఫేస్ 2ను నిర్వహించడానికి వీలు ఉంటుందనేది బీసీసీఐ ఉద్దేశం. అదే జరిగితే- ఇక అదే షెడ్యూల్ దాదాపు ఖాయం కావడానికి పూర్తి అవకాశఆలు ఉన్నాయి. ఈ నెల 29వ తేదీన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












