
విదేశీ స్టార్ క్రికెటర్ల సంగతేంటీ?
అర్ధాంతరంగా ఐపీఎల్ 2021 వాయిదా పడటం వల్ల విదేశీ క్రికెటర్లు ఆడతారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఐపీఎల్ ఫేస్ 2 నిర్వహణ కోసం బీసీసీఐ ఖాయం చేసుకున్న షెడ్యూల్‌లోనే ఆయా దేశాల బోర్డులు.. తమ క్రికెటింగ్ షెడ్యూల్‌ను రూపొందించుకోవడమే దీనికి కారణం. పైగా అదే సమయంలో ఛాంపియన్ క్రికెట్ లీగ్ కూడా తెరమీదికి వచ్చింది. ఫలితంగా- విండీస్ ప్లేయర్లు కూడా దూరం కావచ్చనే అనుమానాలొచ్చినప్పటికీ.. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఈ లీగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసింది.

ఇప్పటికే ఇంగ్లాండ్ దూరం
ఐపీఎల్ టోర్నమెంట్‌లో గ్లామరస్‌గా మార్చడంలో విదేశీ ప్లేయర్ల పాత్రే అధికం. ఆసీస్, కివీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్ల బ్యాటింగ్.. బౌలింగ్..ఫీల్డింగ్ స్టంట్స్ ఈ మ్యాచ్‌లను అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మార్చివేశాయి. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఇప్పటికే ఐపీఎల్ ఫేస్ 2కు దూరం అయ్యారు. ఫుల్ ప్యాక్డ్ క్రికెటింగ్ క్యాలెండర్‌ను ఎదుర్కొంటోన్నందున ఐపీఎల్‌లో ఆడేది అనుమానమే. భారత్‌తో స్వదేశంలో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన వెంటనే ఆసియా ఉపఖండం పర్యటనకు వచ్చేస్తుంది ఇంగ్లాండ్. సెప్టెంబర్ 19 లేదా 20వ తేదీన బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ను ఆడుతుంది. బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్నతరువాత.. అటు నుంచి అటే పాకిస్తాన్‌తో సిరీస్ ఆడనుంది. సుమారుగా నెలరోజుల పాటు ఈ రెండు దేశాల్లో ఇంగ్లాండ్ జట్టు పర్యటించాల్సి ఉన్నందున దాన్ని కాదని.. ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్ ఉండదు.

ఆ లోటును ఆసీస్ తీర్చుతుందా?
ఇంగ్లాండ్ క్రికెటర్లు లేని లోటును ఆస్ట్రేలియా తీర్చే అవకాశాలు దాదాపు ఖాయమైనట్టే. ఐపీఎల్ ఫేస్ 2 షెడ్యూల్ సమయంలో ఆస్ట్రేలియా శ్రీలంక షెడ్యూల్‌ను పెట్టుకుంది. శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఆసీస్‌తో మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20ల్లో తలపడుతుంది. ఈ సిరీస్‌కు ఎంపిక కాలేని ఆటగాళ్లు ఐపీఎల్ 2021లో ఆడటానికి క్రికెట్ ఆస్ట్రేలియా దాదాపు అనుమతి ఇచ్చినట్టేనని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల కోల్‌కత నైట్ రైడర్స్ స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ ఫేస్ 2కు దూరంగా ఉంటోన్నాడు. లంక జట్టుకు ఎంపిక కాని క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడొచ్చంటూ క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించినట్లు అక్కడి మీడియా తెలిపింది.

దక్షిణాఫ్రికా రెడీ..
సౌతాఫ్రికన్ క్రికెటర్లందరూ దాదాపు ఓకేనే. ఐపీఎల్‌లో ఆడటానికి రెడీగా ఉన్నారు. క్వింటన్ డీకాక్, మార్కో జెన్‌సెన్-ముంబై ఇండియన్స్, ఫాప్ డుఫ్లెసిస్, లుంగి ఎంగిడి-చెన్నై సూపర్‌కింగ్స్, కగిసో రబడ, ఎన్రిచో నోర్ట్‌జె--ఢిల్లీ కేపిటల్స్, క్రిస్ మోరిస్-రాజస్థాన్ రాయల్స్, డేవిడ్ మిల్లర్-పంజాబ్ కింగ్స్ ఆడటం ఖాయమైంది. బంగ్లా క్రికెటర్లు షకీబుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ గైర్హాజర్ అవుతారు. ఇంగ్లాండ్ జట్టు తమ దేశ పర్యటనకు వస్తోన్నందున ఆ ఇద్దరు ఐపీఎల్ ఫేస్ 2కు దూరమే.


Click it and Unblock the Notifications












