
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌లో రెండో దశ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్‌లో ఆరంభం కావాల్సిన ఈ సీజన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లల్లో పాల్గొనడానికి కొన్నికీలక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ను రీషెడ్యూల్ చేసింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. ఇప్పుడు అదే జాబితా ఇంగ్లాండ్ కూడా చేరింది. బంగ్లాదేశ్ పర్యటనను వాయిదా వేసింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఓ సందేశాన్ని పంపించినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 ఫేస్ 2 టోర్నమెంట్‌లో పాల్గొనడానికి ఇంగ్లాండ్ క్రికెటర్లకు అతిపెద్ద అడ్డంకిగా ఉంటూ వచ్చిన బంగ్లాదేశ్ పర్యటనను వాయిదా వేసింది. దీనితో- ఇంగ్లీష్ టీమ్ ప్లేయర్లు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇప్పటికే బిజీ షెడ్యూల్‌లో ఉంటోన్నాయి క్రికెట్ ఆడే అన్ని దేశాలు కూడా. భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ బుధవారం ఆరంభం కావాల్సి ఉంది. పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్‌కు వెళ్లాంది. ఆస్ట్రేలియా టీమ్ బంగ్లాదేశ్‌లో ఉంది. అంతకుముందే- పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే.
ఆయా దేశాలకు చెందిన క్రికెటర్లందరు కూడా ఐపీఎల్ 2021 టోర్నమెంట్‌లో మిగిలిపోయిన మ్యాచుల్లో ఆడాల్సి ఉంది. దానికి అనుగుణంగా టీమిండియా తన షెడ్యూల్‌ను రూపొందించుకుంది గానీ.. మిగిలిన బోర్డులేవీ ఆ పని చేయలేకపోయాయి. ఫలితంగా ఆయా దేశాలకు చెందిన క్రికెటర్లు కొంత ఒత్తిడిని, బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఈ ఒత్తిడి మధ్యే ఇంగ్లాండ్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆస్ట్రేలియా టూర్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ బంగ్లాదేశ్‌కు వెళ్లేలా ఇదివరకు షెడ్యూల్‌ను రూపొందించుకుంది. జానీ బెయిర్‌స్టో, ఇవాన్ మోర్గాన్ వంటి ప్లేయర్లు.. ఐపీఎల్‌లో కీలకంగా మారారు.
తాజాగా- ఇప్పుడా అవసరం రాలేదు ఇంగ్లాండ్ బోర్డుకు. ఐపీఎల్ 2021 ఫేస్ 2 ను దృష్టిలో ఉంచుకుని.. తమ జట్టు బంగ్లా పర్యటనను వాయిదా వేసింది. ఫలితంగా- ఐపీఎల్‌కు ఎంపికైన ఇంగ్లాండ్ ప్లేయర్లందరూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అడుగు పెట్టడం ఖాయమైనట్టే. ఐపీఎల్ సెకెండ్ ఫేస్‌కు ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటారని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా ధృవీకరించింది. బంగ్లాదేశ్ పర్యటనను వాయిదా వేసుకోవాలంటూ తమ కార్యదర్శి జయ్ షా చేసిన విజ్ఞప్తికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సానుకూలంగా స్పందించిందని, తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్‌కు పంపిస్తామని సందేశాన్ని ఇచ్చిందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.