
బీజీగా క్రికెట్ వరల్డ్..
మరోవంక- క్రికెట్ సిరీస్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ టూర్‌లో ఉంది. పాకిస్తాన్ టీమ్ వెస్టిండీస్‌లో పర్యటనలో ఉంది. ఇలా క్రికెట్ ఆడే అన్ని ప్రధాన దేశాలు బిజీ షెడ్యూల్‌లో గడుపుతోన్నాయి. ఈ పరిస్థితుల మధ్య సెప్టెంబర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ పార్ట్-2 ఆరంభం కానుంది. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ మ్యాచ్‌లు సాగనున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే విడుదల చేసింది. వచ్చేనెల 19వ తేదీన తొలి మ్యాచ్

శ్రీలంక టూర్ ఎఫెక్ట్..
ఐపీఎల్ 2021 ఫేస్ 2కు సంబంధించిన బయో బబుల్ ప్రొటోకాల్స్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. శ్రీలంక పర్యటనలో ఎదురైన చేదు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ కొత్త బయో బబుల్ ప్రొటోకాల్స్‌ను రూపొందించినట్లు కనిపిస్తోంది. శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 జట్టులో సభ్యుడైన కృనాల్ పాండ్యా కరోనా వైరస్ బారిన పడటం.. అతనితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది క్రికెటర్లు ఐసొలేషన్‌లోకి వెళ్లడం, వారిలో యజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్‌కు వైరస్ సోకడం వంటి పరిణామాలు బీసీసీఐపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు స్పష్టమైంది.

బయోబబుల్ కొత్త ప్రొటోకాల్స్..
వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కొత్త బయోబబుల్ ప్రొటోకాల్స్‌కు తుది రూపాన్ని ఇచ్చింది. బయోబబుల్ ప్రొటోకాల్స్ ఉల్లంఘన విషయంలో బీసీసీఐ ఎంత కఠినంగా వ్యవహరిస్తోందనేది కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ బయోబబుల్‌ను ఉల్లంఘించిన వారు ఎలాంటి వారైనా.. ఎంతటి వారైనా.. ఉపేక్షించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. చివరికి- ఫ్రాంఛైజీలు, టీమ్ మేనేజ్‌మెంట్లను కూడా వదలదలచుకోలేదు. క్రికెటర్ల భార్యాపిల్లలు, వారి కుటుంబ సభ్యుల పైనా కఠిన చర్యలను తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.

నో ఎక్స్‌క్యూజ్..
బయోబబుల్ సెక్యూర్‌ను ఉల్లంఘించితే- ఫ్రాంచైజీలు, క్రికెటర్ల కుటుంబ సభ్యులు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- భారత్‌లో నిర్వహించాల్సిన ఈ టోర్నమెంట్‌ను యూఏఈకి తరలించాల్సి వచ్చిందని బీసీసీఐ గుర్తు చేసింది. అక్కడ కూడా ఇదే వాతావరణం నెలకొనడాన్ని నివారించడానికి కొత్త బయోబబుల్ ప్రొటోకాల్స్‌ను కఠినంగా రూపొందించాల్సి వచ్చిందని తెలిపింది. బయోబబుల్ నిబంధనలను అమలు చేసే విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

విదేశీ ప్లేయర్లకు నో క్వారంటైన్
ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడుతోన్న విదేశీ క్రికెటర్లకు బీసీసీఐ తీపికబురు అందించింది. మ్యాచ్‌లను ఆడటానికి వచ్చే విదేశీ ప్లేయర్లకు క్వారంటైన్‌కు తరలించదలచుకోలేదని స్పష్టం చేసింది. అంటే- విదేశీ ప్లేయర్లు నేరుగా తమ ఫ్రాంఛైజీల్లో చేరే వీలును కల్పించినట్టయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్‌లో వేర్వేరు ఫ్రాంఛైజీల్లో ఆడుతున్నారు. టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందు వారిని రెండు వారాల పాటు క్వారంటైన్‌ను తరలించాల్సి ఉంటుంది. తాజాగా ఇందులో మార్పులు చేసింది. విదేశీ ప్లేయర్లకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.

ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి..
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, సభ్యులందరూ కోవిడ్ 19 ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టులను అందజేయాల్సి ఉంటుందని బీసీసీఐ తన కొత్త బయోబబుల్ ప్రొటోకాల్స్‌లో స్పష్టం చేసింది. యుఏఈ విమానం ఎక్కడానికి 72 గంటల ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్‌ను అందజేయడాన్ని తప్పనిసరి చేసింది. విదేశీ ప్లేయర్లు గానీ, దేశీయ క్రికెటర్లు గానీ.. ఫ్రాంఛైజీలతో కలిసి లేదా వేర్వేరుగా తమకు దగ్గరగా ఉన్న విమానాశ్రయాల నుంచి యుఏఈకి రావొచ్చని బీసీసీఐ పేర్కొంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు 48-72 గంటల ఆర్టీపీసీఆర్ నివేదికను చూపించాల్సి ఉంటుందనే నిబంధనను అనుసరించాలని సూచించింది.

రెండు డోసుల వ్యాక్సిన్..
ఐపీఎల్ 2021లో పాల్గొనడానికి విమానం ఎక్కే ప్రతి సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్, టీమ్ మేనేజ్‌మెంట్.. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలని సూచించింది. ఐపీఎల్ 2021 ఫేస్ 2తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలని పేర్కొంది. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ ఐపీల్ 2021ను యుఏఈలో నిర్వహించేలా రీషెడ్యూల్ చేసినందు వల్ల అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరూ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలని సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బీసీసీఐకి అందజేయాలని తెలిపింది. బయోబబుల్ నిబంధనలు, మార్గదర్శకాలను మాత్రం ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని, దీన్ని విస్మరించవద్దని సున్నితంగా హెచ్చరించింది.


Click it and Unblock the Notifications












