IPL 2021 Phase 2: ఫిట్‌నెస్ కోసం ఆరోన్ ఫించ్ ప్రిపేర్: ఆ రెండు సిరీస్‌ల నుంచి అవుట్

బ్రిడ్జిటౌన్: ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్, కేప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం కొనసాగుతోన్న వెస్టిండీస్ సిరీస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. దీని తరువాత ఆరంభం అయ్యే బంగ్లాదేశ్ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదతను. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌లల్లో ఐపీఎల్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌లోని మిగిలిన మ్యాచ్‌లతో పాటు టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ వ్యవధిలో మోకాలికి సర్జరీ చేయించుకోనున్నాడు. మోకాలి సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నందున ఈ రెండు సిరీస్‌ల నుంచి తప్పుకొంటోన్నట్లు చెప్పాడు.

ఫిట్‌నెస్ కోసం..
ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఫించ్ అందుబాటులో లేకపోవడం వల్ల జట్టుకు అలెక్స్ క్యారీ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. వెస్టిండీస్‌తో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా సెయింట్ లూసియాలో ప్రాక్టీస్ చేస్తూ అతను గాయపడ్డాడు. కుడి మోకాలికి గాయమైంది. దీనికి సర్జరీ అవసరమైంది. గాయం కారణంగా టీ20 సిరీస్, వన్డే ఇంటర్నేషనల్స్‌కు ఆరోన్ ఫించ్ దూరమయ్యాడు. ఫలితంగా- వెస్టిండీస్ పర్యటన ముగిసిన తరువాత ఫించ్..జట్టుతో పాటు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లట్లేదు. స్వదేశానికి తిరుగుముఖం పడతాడు.

ఐపీఎల్.. టీ20 వరల్డ్ కప్
అనంతరం మోకాలికి సర్జరీ చేయించుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతోంది. ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండాలనే నిర్ణయంతో వెస్టిండీస్‌తో జరిగే మిగిలిన మ్యాచ్‌లు, బంగ్లాదేశ్ సిరీస్‌లో ఆడకూడదని ఆరోన్ భావిస్తోన్నట్లు తెలిపింది. యుఏఈ, ఒమన్‌లల్లో నిర్వహించబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ మెగా టోర్నమెంట్ నాటికి ఆరోన్ ఫించ్ అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ ఆఫీసర్స్ అంచనా వేస్తోన్నారు. వెస్టిండీస్ నుంచి స్వదేశానికి తిరుగుముఖం పట్టిన తరువాత అతను రెండువారాల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. ఆ తరువాత సర్జరీ చేయించుకుంటాడని తెలుస్తోంది.

అలెక్స్ క్యారీ కేప్టెన్సీ..
ఆరోన్ ఫించ్ ఆబ్సెన్సీలో ఆస్ట్రేలియా జట్టుకు అలెక్స్ క్యారీ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. అతని నేతృత్వంలోని ఆసీస్ జట్టు విండీస్‌ను ఢీ కొంటోంది. ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ ముగిసింది. వన్డే ఇంటర్నేషనల్స్ ఆరంభం అయ్యాయి. తొలి వన్డేలో దారుణ పరాజయాన్ని చవి చూసింది కరేబియన్ టీమ్. రెండో వన్డేలో ప్రతీకారాన్ని తీర్చుకుంది. బ్రిడ్జిటౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. 47.1 ఓవర్లలో 187 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన వెస్టిండీస్ జట్లు ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి, విజయాన్ని అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications