
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకొచ్చేది విరాట్ కోహ్లీ.. ఆ తరువాత మిస్టర్ 360 డిగ్రీస్ ఏబీ డివిలియర్స్. ఈ ఇద్దరు జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలాంటి వాళ్లే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచైనా జట్టును ఒడ్డున పడేసే సత్తా ఉన్నవాళ్లే. ప్రత్యేకించి- ఏబీ డివిలియర్స్. అతను క్రీజ్‌లో ఉంటే ఎలాంటి టెన్షన్ లేకుండా డగౌట్‌లో ఎంజాయ్ చేస్తూ ఉంటానని పలుమార్లు చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.
రాయల్ ఛాలెంజర్స బెంగళూరు టీమ్‌లో కోహ్లీ-డివిలియర్స్‌ను గ్రేట్ ఫ్రెండ్స్‌గా చెప్పుకొంటారు అభిమానులు. దాన్ని మరోసారి నిరూపించుకున్నారు విరాట్ కోహ్లీ-ఏబీ డివిలియర్స్. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఇద్దరూ స్పెషల్ మెసేజీలను ఇచ్చిపుచ్చుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఒకరినొకరు ఎమ్మార్ఎఫ్‌తో పోల్చుకున్నారు. ఎమ్మార్ఎఫ్‌కు కొత్త అర్థాన్ని ఇచ్చారు. మోస్ట్ రిలియబుల్ ఫ్రెండ్‌గా కితాబిచ్చుకున్నారు.
విరాట్ కోహ్లీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మొదట ఏబీ డివిలయర్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోస్ట్ చేశాడు. వారు వినియోగించే ఎంఆర్‌ఎఫ్ బ్యాట్, ఆ పక్కనే తన ఫొటో, విరాట్ కోహ్లీ ఫొటోను పేస్ట్ చేశాడు. ఆ కార్డ్‌పై మై రిలియబుల్ ఫ్రెండ్ అని రాసుకొచ్చాడు. వెంటనే దానికి విరాట్ కోహ్లీ రిప్లై ఇచ్చాడు. మోస్ట్ రిలియబుల్ ఫ్రెండ్ అని పేర్కొన్నాడు. ఇలా వారిద్దరు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.
ఇలా పలువురు క్రికెటర్లు తమ స్నేహితులకు గ్రీటింగ్ చెప్పుకొన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మెంబర్ యజువేందర్ చాహల్ ఇలాంటిదే ఓ వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యజువేందర్ చాహల్ ఉన్న ఓ యాడ్ ఫిల్మ్ లేదా ఐపీఎల్ ప్రోమో షూటింగ్‌కు సంబంధించిన క్లిప్ అది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతోన్న టర్బొనేటర్ హర్భజన సింగ్.. తన తమిళ్ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తోన్న మూవీ అది. యువరాజ్ సింగ్, నవ్‌దీప్ షైనీ, సూర్యకుమార్ యాదవ్, వసీం జాఫర్ బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్లు చేశారు.