Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs SRH: ముందు మ్యాచ్ గెలవండిరా అయ్యా.. ఈ పజిల్స్ తర్వాత ఆడుకుందాం! సన్‌రైజర్స్‌పై ఫాన్స్ ఫైర్!

IPL 2021, PBKS vs SRH: Sunrisers Hyderabad Twitter Handle Gets Trolled Brutally by SRH fans

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో ఇప్పటివరకు గెలుపు రుచిచూడని ఏకైక జట్టుగా కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. మరికొద్ది సేపట్లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్.. మూడింటిలోనూ ఓడిపోయింది. ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ప్రతి మ్యాచ్‌లోనూ బౌలర్లు సత్తాచాటుతూ ప్రత్యర్థిని తక్కువ స్కోర్లకే పరిమితం చేసినా.. మిడిలార్డర్ వైఫల్యంతో మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటములను ఎదుర్కొంది. అయితే ఈ రోజు మ్యాచ్ నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్రాంచైజీ అభిమానులకు ఓ పజిల్ వేసింది.

అభిమానులకు పజిల్:

కొద్దిసేపటి క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ తన అధికార ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఓ పజిల్ వేసింది. 'మరొక మ్యాచ్, మీకు

సన్‌రైజర్స్ జెర్సీలను గెలవడానికి మరొక అవకాశం. సరైన సమాధానం చెపితే చాలు' అని ఓ పజిల్ వేసి ట్వీట్ చేసింది. N, H, K అని లెటర్స్ ఇచ్చి.. ఓ నాలుగు ప్రశ్నలు వేసి ఆ పజిల్‌ను సాల్వ్ చేయని చెప్పింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన కొందరు ఫాన్స్ వార్నర్, సంగక్కర, రషీద్, భువీ పేర్లతో ఆ పజిల్‌ను సాల్వ్ చేశారు. నిజానికి అదే సరైన సమాధానం. చాలా మంది సరైన సమాధానాలు ఇచ్చారు.

ముందు మ్యాచ్ గెలవండిరా అయ్యా:

ఇంకొంతమంది తెలుగు అభిమానులు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ చేసిన ట్వీటును చూసి మండిపడుతున్నారు. మ్యాచులు గెలవడం పక్కన పెట్టి.. పజిల్‌ వేస్తున్నారా? అని ఫైర్ అవుతున్నారు. 'ముందు మ్యాచ్ గెలవండిరా అయ్యా.. ఈ పజిల్స్ తర్వాత ఆడుకుందాం' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఏందిరా మీ పత్తాపారం ట్వీట్లు.. కేన్ ఉన్నాడా లేదా చెప్పండి' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఈ రోజన్నా గెలవండన్నా కాస్త', 'ముందు మ్యాచ్ గెలిచిచూపండి' అంటూ ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబందించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

11 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ విజయం:

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకూ 16 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ విజయం సాధించగా.. 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందింది. ఈ రెండు జట్లు తలపడిన ప్రతి సందర్భాల్లోనూ మెరుగైన స్కోర్లు నమోదవుతున్నాయి. తాజా సీజన్‌లో బోణి కోసం నిరీక్షిస్తున్న సన్‌రైజర్స్.. గెలిచేందుకు ఇంత కంటే మంచి అవకాశం దొరకదేమో. పంజాబ్ జట్టులో స్టార్ బౌలర్లు లేకపోవడం కూడా మనకు కలిసొచ్చే అంశం.

తుది జట్లు:

హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్.

పంజాబ్ : కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, జలజ్ సక్సెనా, జై రిచర్డ్‌సన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్/మురుగన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Wednesday, April 21, 2021, 15:17 [IST]
Other articles published on Apr 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+