
చెన్నై: చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాదించాడు. రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగులు పూర్తి చేశాడు. సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సింగల్ తీయడంతో రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగుల మార్క్ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు.
కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 143 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు చేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 167 ఇన్నింగ్స్‌లలో ఆ మార్క్ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా 173 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు చేశాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తిచేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా రాహుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ 132 ఇన్నింగ్స్‌లలోనే ఆ మార్క్ చేరుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోరుకే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన నాలుగో ఓవర్ మొదటి బంతిని షాట్ ఆడిన లోకేష్ రాహుల్ మిడ్ వికెట్‌లో కేదార్ జాదవ్ చేతికి చిక్కాడు. వాంఖడే మైదానంలో జోరుగా బ్యాటింగ్ చేసిన రాహుల్ (4)..చెన్నై పిచ్‌కు అనుగుణంగా బ్యాటింగ్ చేయకపోవడంతో మూల్యం చెల్లించుకున్నాడు. ఐపీఎల్ 2021లో రాహుల్ మోస్తరు ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే.
ఖలీల్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ ఆఖరి బంతికి మయాంక్ అగర్వాల్. .రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. విజయ్ శంకర్ వేసిన తర్వాతి ఓవర్ మొదటి బంతిని క్రిస్ గేల్ కవర్ దిశగా షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న నికోలస్ పూరన్.. డేవిడ్ వార్నర్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు వేసిన డైరెక్ట్ త్రోకు రనౌటయ్యాడు. దీంతో పూరన్ (0) డైమండ్ డక్‌గా పెవిలియన్ చేరాడు. 12వ ఓవర్ మూడో బంతికి దీపక్ హుడా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. పంజాబ్ 12 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 66 రన్స్ చేసింది.