Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. సుందర్ ఔట్! మూడు మార్పులతో పంజాబ్!

IPL 2021, PBKS vs RCB: Royal Challengers Bangalore won the toss and opted to field

అహ్మదాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చినట్టు కోహ్లీ చెప్పాడు. మరోవైపు పంజాబ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. రిలే మెరిడిత్‌, ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ బార్‌ జట్టులోకి వచ్చారు.

ఈ సీజన్‌లో అంచనాలకి మించి బెంగళూరు రాణిస్తుండగా.. ఎప్పటిలానే పంజాబ్ కింగ్స్ తడబడుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదింట్లో గెలుపొంది ఫుల్ జోషులో ఉంది. 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్ కేవలం రెండింట్లో మాత్రమే గెలిచి.. నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

ఐపీఎల్‌లో బెంగళూరు, పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. బెంగళూరుపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 232 పరుగులు కాగా.. పంజాబ్‌పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 226. అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు అనుకూలం. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 170 పరుగులు కూడా కాపాడుకోవచ్చు.

తుది జట్లు:
బెంగళూరు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిధార్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, షాబాజ్‌ అహ్మద్‌, డేనియల్‌ సామ్స్‌, కైల్ జెమీసన్‌, మహ్మద్‌ సిరాజ్‌, యజ్వేంద్ర చహల్‌, హర్షల్‌ పటేల్‌.

పంజాబ్: కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌)‌, క్రిస్‌ గేల్‌, దీపక్‌ హూడా, నికోలస్ పూరన్‌‌, షారుఖ్‌ ఖాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, మొహ్మద్ షమీ, రవి బిష్ణోయి, రిలే మెరిడిత్‌, ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ బార్‌.

Story first published: Friday, April 30, 2021, 19:22 [IST]
Other articles published on Apr 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+