For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs RCB:బెంగళూరుతో పంజాబ్ ఢీ..బరిలోకి టీ20 నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌!కింగ్స్ రాత మారేనా? తుది జట్లు ఇవే!

IPL 2021: PBKS vs RCB predicted playing 11, Preview and dream11 tips for match 26

అహ్మదాబాద్‌: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో అంచనాలకి మించి బెంగళూరు రాణిస్తుండగా.. ఎప్పటిలానే పంజాబ్ కింగ్స్ తడబడుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదింట్లో గెలుపొంది ఫుల్ జోషులో ఉంది. మరోవైపు ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్ కేవలం రెండింట్లో మాత్రమే గెలిచి పట్టికలో ఆరో స్థానంలో ఉంది. బెంగళూరుపై పంజాబ్ గెలవాలంటే శ్రమించాల్సిందే.

జోరుమీదున్న మ్యాక్సీ, ఏబీ

జోరుమీదున్న మ్యాక్సీ, ఏబీ

బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారు. పవర్ ప్లేలో ధాటిగా పరుగులు చేస్తూ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఆపై గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ కూడా సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు ధాటిగా ఆడుతూ టీమ్‌కి మెరుగైన స్కోరుని అందిస్తున్నారు.

రజత్ పాటిదార్‌ చేరికతో టాప్ ఆర్డర్‌ మరింత మెరుగైంది. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, డాన్ క్రిస్టియన్ బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ నిరాశపరుస్తున్నాడు. క్రిస్టియన్ స్థానంలో డేనియల్ సామ్స్ ఆడే అవకాశం ఉంది. అయితే అవసరం అయినప్పుడు కైల్ జెమీషన్ కూడా బ్యాట్ జుళిపిస్తున్నాడు. మొత్తానికి కోహ్లీసేన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.

సుందర్ ఫామ్ అందుకుంటే

సుందర్ ఫామ్ అందుకుంటే

బౌలింగ్ పరంగా కూడా బెంగళూరు బాగానే ఉంది. హర్షల్ పటేల్ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. పరుగులు ఇస్తున్నా.. వికెట్లు కూడా పడగొడుతున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 37 పరుగులు సమర్పించుకున్న తర్వాత.. ఢిల్లీతో గత మ్యాచ్‌లో మళ్లీ లయ అందుకున్నాడు.

మహ్మద్ సిరాజ్, కైల్ జెమీషన్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే డెత్ ఓవర్లలో మాత్రం తేలిపోతున్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన స్పిన్ మాయ ఇప్పటివరకు చేయలేదు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. వీరిద్దరూ కూడా ఫామ్ అందుకుంటే బెంగళూరు మరో విజయం ఖాతాలో వేసుకోవచ్చు.

జట్టులోకి మలన్:

జట్టులోకి మలన్:

పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పేపరుపై చాలా బలంగా కనిపిస్తోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడుతున్నారు. క్రిస్‌ గేల్ మ్యాచుకు అనుగుణంగా ఆడుతున్నాడు. అయితే దీపక్ హుడా, నికోలస్ పూరన్ హిట్టింగ్ చేస్తున్నా.. భారీ స్కోర్ చెయ్యట్లేదు. ఆల్‌రౌండర్ మొయిసెస్ హెన్రిక్యూస్ వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతూ టీమ్‌కి భారంగా మారిపోయాడు.

దీంతో టీ20 నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌ డేవిడ్ మలన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అతడు అయినా పంజాబ్ జట్టును విజయాల బాట పాటిస్తాడేమో చూడాలి. యువ హిట్టర్ షారూక్ ఖాన్ బంతిని బలంగా బాదుతున్నా.. ఫినిషర్ రోల్‌ని పోషించడం లేదు. మిడిల్ ఆర్డర్ ఆడితే పంజాబ్ మెరుగైన స్కోర్ చేసే అవసఖం ఉంది.

జోర్దాన్ విఫలం

జోర్దాన్ విఫలం

పంజాబ్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ పరుగులు కట్టడి చేస్తున్నా.. వికెట్లు మాత్రం పడగొట్టడం లేదు. ఇక మిడిల్ ఓవర్లలో పరుగులు ఎక్కువగా ఇస్తున్నారు. ఒక ఎండ్‌లో స్పిన్నర్ రవి బిస్ణోయ్ పొదుపుగా బౌలింగ్ చేస్తుంటే.. మరో ఎండ్ నుంచి దీపక్ హుడా ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు.

క్రిస్ జోర్దాన్ కూడా తేలిపోతున్నాడు. ఇదే ఆ జట్టుకు పెద్ద నష్టం కలిగిస్తోంది. వరుస విజయాలతో జోరుమీదున్న బెంగళూరుని ఓడించాలంటే.. పంజాబ్ బౌలర్లు సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. మ్యాక్సీ, ఏబీని ఆపాలంటే పంజాబ్ మాయ చేయాల్సిందే.

రికార్డుల్లో కింగ్స్‌దే పైచేయి:

రికార్డుల్లో కింగ్స్‌దే పైచేయి:

ఐపీఎల్‌లో బెంగళూరు, పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. బెంగళూరుపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 232 పరుగులు కాగా.. పంజాబ్‌పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 226. అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు అనుకూలం. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 170 పరుగులు కూడా కాపాడుకోవచ్చు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్‌, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, డాన్ క్రిస్టియన్/డేనియల్ సామ్స్, యుజ్వేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్, కైల్ జెమీషన్, హర్షల్ పటేల్.

పంజాబ్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్‌ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, మొయిసెస్ హెన్రిక్యూస్/డేవిడ్ మలన్, షారూక్ ఖాన్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవి బిస్ణోయ్, క్రిస్ జోర్దాన్.

Story first published: Friday, April 30, 2021, 15:37 [IST]
Other articles published on Apr 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+