For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs KKR: మోడీ మైదానంలోనైనా కోల్‌కతా రాత మారేనా?.. కింగ్స్‌ మరో విజయం సాధించేనా? తుది జట్లు ఇవే!

IPL 2021: PBKS vs KKR predicted playing 11, dream11 tips for match 21

అహ్మదాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో వరుస పరాజయాలతో ఢీలాపడిపోయిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.. పటిష్ట ముంబై ఇండియన్స్‌పై గెలిచి మంచి ఊపులో ఉన్న పంజాబ్ కింగ్స్‌ను ఈ రోజు రాత్రి ఢీ కొట్టనుంది. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచుకు వేదిక కానుంది. మోడీ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తుండటం ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాల్గింటిలో ఓడిపోగా.. పంజాబ్ మూడు మ్యాచ్‌ల్లో ఓడి రెండింటిలో విజయం సాధించింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కోల్‌కతాకు మోడీ మైదానం అయినా కలిసొస్తుందో చూడాలి.

పేలవ ఫామ్‌లో రాణా, గిల్, మోర్గాన్

పేలవ ఫామ్‌లో రాణా, గిల్, మోర్గాన్

కోల్‌కతా జట్టులో ఓపెనర్లు నితీశ్ రాణా, శుభమన్ గిల్ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నారు. ఇద్దరూ ఆరంభం ఇస్తేనే భారీ స్కోర్ చేయొచ్చు. నెం.3లో ఆడుతున్న రాహుల్ త్రిపాఠి మాత్రం దూకుడుగా ఆడుతున్నా.. మెరుగైన స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాడు.

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్ తక్కువ స్కోర్లకే వికెట్ చేజార్చుకుంటున్నారు. దినేష్ కార్తీక్, ఆండ్రీ రసెల్, పాట్ కమిన్స్ మెరుపులు ఒక మ్యాచ్‌కే పరిమితం అయ్యాయి. అందరూ సమిష్టిగా ఆడితేనే కోల్‌కతా భారీ స్కోర్ చేయగలదు లేదా ఛేదించగలదు. ఇప్పటికే ఐదు మ్యాచులు పూర్తయిన నేపథ్యంలో కోల్‌కతా విజయాల బాట పట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.

కమిన్స్‌ విఫలం

కమిన్స్‌ విఫలం

కోల్‌కతా బౌలర్లలో స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. కమిన్స్‌ సత్తాచాటితే కోల్‌కతాకు సగం బెంగ తీరినట్టే. ప్రసిద్ క్రిష్ణ, శివమ్ మావి టీమ్‌ని గెలిపించే ప్రదర్శన ఇప్పటి వరకూ కనబర్చలేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. వికెట్ల తీయలేకపోతున్నాడు. సునీల్ నరైన్ తన మార్క్ చూపించడం లేదు. ఇప్పటికైనా అందరూ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐతే బెన్ కట్టింగ్ లేదా లాకీ ఫెర్గూసన్ అతని స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి.

సూపర్ ఫామ్‌‌లో రాహుల్, షమీ

సూపర్ ఫామ్‌‌లో రాహుల్, షమీ

పంజాబ్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌‌లో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతున్నాడు. క్రిస్‌ గేల్ మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆడుతున్నాడు. అయితే హిట్టర్ నికోలస్ పూరన్ వరుస డకౌట్లతో నిరాశపరుస్తుండడం కాస్త నిరాశపరిచే అంశం. దీపక్ హుడా, హెన్రిక్యూస్, షారూక్ ఖాన్ బ్యాట్ జులిపించాల్సిన సమయం వచ్చింది.

ఇక మహ్మద్ షమీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బందిపెడుతుండగా.. అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్లలో అదరగొడుతున్నాడు. రవి బిష్ణోయ్, దీపక్ హుడా మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే ఫాబియన్ అలెన్ మాత్రం ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. ఇదెక్కటి సెట్ చేసుకుంటే పంజాబ్ విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

ఐపీఎల్‌లో పంజాబ్, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ 27 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో 18 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందింది. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పంజాబ్‌పై కోల్‌కతా చేసిన అత్యధిక పరుగులు 245 కాగా.. కోల్‌కతాపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 214 రన్స్.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

పంజాబ్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, జే రిచర్డ్సన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.

కోల్‌కతా: శుభమన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, బెన్ కట్టింగ్/లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ, పాట్ కమిన్స్, శివం మావి.

Story first published: Monday, April 26, 2021, 14:06 [IST]
Other articles published on Apr 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+