For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసిన దీపక్ చహర్.. చేతులెత్తేసిన పంజాబ్ బ్యాట్స్‌మన్‌! చెన్నైకి స్వల్ప లక్ష్యం!

IPL 2021, PBKS vs CSK: Deepak Chahar gets career-best IPL figures, Punjab struggle to reach 106

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చహర్ చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చహర్ ఐపీఎల్ టోర్నీలో కెరీర్ బెస్ట్ గణాంకాలు (4/13) నమోదు చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 రన్స్ చేసి.. చెన్నైకి 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ మాత్రం బ్యాట్ జులిపించాడు. 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు. షారుఖ్ కూడా ఆడకుంటే పంజాబ్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదే. చెన్నై బౌలర్లలో చహర్ 4 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రేవో తలో వికెట్ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు చెన్నై పేసర్ దీపక్‌ చహర్‌ చుక్కలు చూపించాడు. నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోవడంతో పంజాబ్‌‌ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ ‌(5), మయాంక్‌ అగర్వాల్ ‌(0)తో పాటు క్రిస్‌ గేల్‌(10), దీపక్‌ హుడా (10), నికోలస్‌ పూరన్‌ (0) టాప్‌ ఆర్డర్‌ మొత్తం పూర్తిగా విఫలమైంది. రాహుల్‌ రనౌట్‌ కాగా.. మిగతా అందర్నీ చహర్‌ పెవిలియన్‌ పంపాడు.

ఈ దశలోనే క్రీజులోకి అడుగుపెట్టిన యువ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ ఖాన్ ‌(47; 36 బంతుల్లో 4x4, 2x6) ధాటిగా ఆడినా.. మరో ఎండ్‌లో అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. జే రిచర్డ్‌సన్‌ (15)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు.. మురుగన్‌ అశ్విన్‌ (6)తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించాడు. చివర్లో మహ్మద్‌ షమీ (9)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 14 పరుగులు జోడించాడు. దీంతో పంజాబ్ స్కోర్ 100 దాటేలా కలిపించింది.

అయితే చివరి ఓవర్‌లో అర్ధ శతకానికి చేరువైన షారుఖ్ ఖాన్‌.. రవీంద్ర జడేజా చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్‌ 101 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. చివరికి 106 పరుగులకు పరిమితమైంది. దీప‌క్ చ‌హ‌ర్ త‌న 4 ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 13 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీయ‌డం విశేషం. దీంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఇక ఫీల్డింగ్‌లో జ‌డేజా అద్భుతంగా రాణించాడు. రాహుల్‌ ర‌నౌట్‌, గేల్ క్యాచ్‌ను ప‌ట్టిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింద‌ని చెప్పొచ్చు.

Story first published: Friday, April 16, 2021, 21:25 [IST]
Other articles published on Apr 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+