
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ఎనిమిదో మ్యాచ్ మరికొద్ది సేపట్లో ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఆరంభం కాబోతోంది. టీమిండియా మాజీ కేప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. కేఎల్ రాహుల్ కేప్టెన్సీ వహిస్తోన్న పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు టీం తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రాబిన్ ఉతప్పకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక ఐపీఎల్ టోర్నీలో చెన్నై జట్టుకు ఎంఎస్ ధోనీ 200వ మ్యాచ్ ఆడుతున్నాడు.
ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 23 ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. చెన్నై 14 విజయాలతో మెరుగైన రికార్డు కలిగి ఉంది. ఇక 9 మ్యాచుల్లో పంజాబ్ నెగ్గింది. గతేడాది జరిగిన రెండు మ్యాచుల్లోనూ ధోనీ సేనదే గెలుపు. మరి ఈ మ్యాచ్‌లో పంజాబ్ ప్రతీకారం ఎలా ఉంటుందో చూడాలి. ముంబై పిచ్ టోర్నీ ఆరంభంలో బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఉన్నా.. గతరాత్రి స్పిన్నర్లకు కూడా అనుకూలించింది. ఢిల్లీ 147 పరుగులే చేసినా.. రాజస్థాన్ కస్టపడి గెలిచింది. మరి ఈరోజు పిచ్ ఎలా ఉండనుందో చూడాలి.
తుది జట్లు:
చెన్నై: ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్/రాబిన్ ఉతప్ప, సురేష్ రైనా, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, సామ్ కరన్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్.
పంజాబ్: ఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికొలస్ పూరన్, షారుఖ్ ఖాన్, జై రిచర్డ్‌సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.