For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: అందుకే మహీ 'మెంటార్‌ సింగ్‌ ధోనీ' అయ్యాడు: పార్థివ్‌ పటేల్

IPL 2021: Parthiv Patel react on MS Dhonis role as India mentor at T20 World Cup 2021

ముంబై: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీని భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్‌ పటేల్‌ 'మెంటార్‌ సింగ్‌ ధోనీ' అని పేర్కొన్నాడు. మహీ ఎంతో కాలం నుంచి క్రికెట్‌ ఆడుతున్నాడని, పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటాడన్నాడు. బౌలర్ల నుంచి సరైన ప్రదర్శన ఎలా రాబట్టాలో తెలిసిన దిట్ట అని పార్థివ్‌ ప్రశంసించాడు. శుక్రవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో తొలుత చెన్నై పట్టు కోల్పోయినట్లు కనిపించినా తర్వాత పుంజుకొని అద్భుత విజయం సాధించింది. ఓపెనర్లు చెలరేగడంతో బెంగళూరు బ్యాటింగ్‌లో భారీ స్కోర్‌ సాధించేలా కనిపించినా.. ధోనీ తన చాకచక్యంతో బౌలింగ్‌లో మార్పులు చేసి కోహ్లీసేనని 156 పరుగులకే పరిమితం చేశాడు.

మ్యాచ్ టర్న్ పాయింట్ అదే:

మ్యాచ్ టర్న్ పాయింట్ అదే:

బెంగళూరు ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరుకు.. ముగిసిన విధానానికి అసలు పొంతనే లేదు. ఒక దశలో 111/0తో ఉన్న బెంగళూరు చివరికి 156/6తో ఇన్నింగ్స్‌ను ముగించింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్‌ దూకుడుగా ఆడటంతో పవర్‌ ప్లే ఆఖరికి బెంగళూరు 55/0తో నిలిచింది. ఆపై ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని భాగస్వామ్యాన్ని 100 దాటించారు. అయితే ఇక్కడే ఎంఎస్ ధోనీ తన అనుభవాన్ని ఉపయోగించాడు. స్పిన్నర్ మొయిన్ అలీకి బదులుగా డ్వేన్ బ్రావోతో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాడు. బ్రావో బౌలింగ్‌లో కోహ్లీ ఔటవడంతో 111 పరుగుల వద్ద తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది. ఆపై శార్దూల్‌ ఠాకూర్‌ (2/29) మధ్యలో బెంగళూరును గట్టి దెబ్బ కొట్టాడు. తొలి 10 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 90 పరుగులు చేసిన కోహ్లీసేన.. చివరి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేయగలిగింది.

మెంటార్‌ సింగ్ ధోనీ:

మెంటార్‌ సింగ్ ధోనీ:

తాజాగా పార్థివ్‌ పటేల్‌ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీని 'మెంటార్‌ సింగ్ ధోనీ' అని ఎందుకు అనాలో ఓ కారణం ఉంది. మహీ ఎంతో కాలం నుంచి క్రికెట్‌ ఆడుతున్నాడు. పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటాడు. పిచ్‌లను అంచనా వేయడంలో దిట్ట. బౌలర్ల నుంచి సరైన ప్రదర్శన ఎలా రాబట్టాలో అతడికి బాగా తెలుసు. డ్వేన్ బ్రావో, శార్దూల్‌ ఠాకూర్ లేదా దీపక్‌ చహర్ ఇలా ఎవర్ని ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో ధోనీకి తెలుసు. ఆటగాళ్లు అతడిని బాగా నమ్ముతారు. ధోనీతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఎందుకంటే.. మహీకి అంత మంచి అనుభవం ఉంది. అంతకు మించి గొప్ప విజయాలు ఉన్నాయి' అని అన్నాడు. ఎంఎస్ ధోనీని బీసీసీఐ ఇటీవల టీ20 ప్రపంచకప్‌ 2021కు భారత జట్టు మెంటార్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

25 టెస్టులు, 38 వన్డేలు:

25 టెస్టులు, 38 వన్డేలు:

పార్థివ్‌ పటేల్‌ 2002లోనే టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే అనుకున్న స్థాయిలో రాణించలేదు. అదే సమయంలో టీమిండియాకు ఎంఎస్ ధోనీ కనిపించాడు. సౌరవ్ గంగూలీ అండతో జట్టులోకి వచ్చిన మహీ.. అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టాడు. కార్ర్ర్ ఆరంభంలోనే కీపింగ్‌, బ్యాటింగ్‌లో సత్తాచాటాడు. ఒక్కోమెట్టు ఎదుగుతూ అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగాడు. ఆపై కెప్టెన్సీలో కూడా తనదైన ముద్ర వేశాడు. దాంతో పార్థివ్‌ పటేల్ ఎక్కువ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేకపోయాడు. 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థివ్‌.. గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

17 ఏళ్ల వయసులోనే:

17 ఏళ్ల వయసులోనే:

2002 ఇంగ్లండ్ పర్యటనలోని టెస్ట్ మ్యాచ్‌తో 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పార్థివ్.. ఈ ఘనతను అందుకున్న అత్యంత పిన్న వికెట్ కీపర్‌గా గుర్తింపుపొందాడు. సచిన్ టెండూల్కర్ తరహాలోనే పాల బగ్గల వయసులో భారత జట్టులోకి వచ్చిన పార్థీవ్‌ను చూసి అతను మరో మాస్టర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎంఎస్ ధోనీ రాకతో జట్టులో చోటు కోల్పోయిన పార్థీవ్.. మళ్లీ 2016లో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. 2018 సౌతాఫ్రికా పర్యటనలో జోహన్నస్‌బర్గ్ వేదికగా జరిగిన టెస్టే పార్థీవ్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఐపీఎల్ టోర్నీలో పార్థివ్ దక్కన్ ఛార్జర్స్, చెన్నై, ముంబై జట్లకు ఆడాడు.

Story first published: Sunday, September 26, 2021, 17:51 [IST]
Other articles published on Sep 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+