ఐపీఎల్-2021: కొత్త టీమ్ కోసం కలలు కంటున్నారా? బీసీసీఐ రివర్స్ స్క్రీన్‌ప్లే: రిస్క్ తీసుకోవట్లే

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొత్త జట్టు వస్తోందనే వార్తలు రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో తొమ్మిది జట్ల మధ్య హోరాహోరీ పోరును చూడొచ్చంటూ క్రికెట్ ప్రేమికులు డిసైడ్ అయ్యారు కూడా. వచ్చే ఏడాది వేసవి సీజన్‌లోనే ఐపీఎల్-2021ను నిర్వహించడం దాదాపు ఖాయం కావడం వల్ల ఇంకో అయిదారు నెలల్లో మళ్లీ ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌ను చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు. పైగా- ఇప్పట్లా ఎక్కడో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి బయటి దేశాల్లో కాకుండా.. స్వదేశంలోనే ఐపీఎల్-2021ను షెడ్యూల్‌ చేయడానికీ ఛాన్స్ ఉంది.

 మోహన్‌లాల్ కో ఓనర్‌గా..

మోహన్‌లాల్ కో ఓనర్‌గా..

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వచ్చే ఏడాది తొమ్మిదో టీమ్‌ కూడా అందుబాటులోకి వస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దీన్ని ధృవీకరించింది కూడా. గుజరాత్ ఫైనాన్షియల్ కేపిటల్ అహ్మదాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ కంపెనీ.. తొమ్మిదో జట్టును రంగంలోకి దించుతుందంటూ వార్తలు వెలువడ్డాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. ఈ నైన్త్ టీమ్‌కు కో ఓనర్‌గా ఉంటారంటూ మీడియా కోడై కూసింది.

బీసీసీఐ..రివర్స్ స్క్రీన్‌ప్లే

బీసీసీఐ..రివర్స్ స్క్రీన్‌ప్లే

అభిమానులు ఒకరకంగా ఆలోచిస్తే.. బీసీసీఐ ఇంకో రకంగా ప్లాన్ చేస్తోంది. తొమ్మిదో ఫ్రాంఛైజీ వ్యవహారంలో బీసీసీఐ ఆలోచనలు వేరుగా ఉంది. ఈ సారి కొత్త జట్టు ఆడటానికి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. కొత్త జట్టుకు, కొత్త ఫ్రాంఛైజీని ఐపీఎల్-2021లో ఇంక్లూడ్ చేయడానికి తగినంత సమయం లేదని బీసీసీఐ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే- దాన్ని వాయిదా వేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఐపీఎల్-2022లోనే కొత్త జట్టు..

ఐపీఎల్-2022లోనే కొత్త జట్టు..

కొత్త ఫ్రాంఛైజీని, కొత్త జట్టును ఐపీఎల్-2021 కోసం ఎంపిక చేయాల్సి వస్తే.. మెగా ఆక్షన్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి సమయం లేదని బీసీసీఐ కరాఖండిగా తేల్చిసినట్టు చెబుతున్నారు. ఐపీఎల్-2021 సీజన్ 14వ ఎడిషన్.. వచ్చే ఏడాది మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో టోర్నమెంట్‌ను నిర్వహించడానికి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగైదు నెలల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించడం, దాన్ని పూర్తి చేయడం.. కష్టతరమౌతుందని బీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జట్టు చేరిక వల్ల మ్యాచ్‌ల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది.

IPL 2020 Final : I Should've Sacrificed My Wicket For In-Form Suryakumar Yadav - Rohit Sharma
కొత్త జట్టు చేరికతో.. మ్యాచ్‌ల సంఖ్యా భారీగా..

కొత్త జట్టు చేరికతో.. మ్యాచ్‌ల సంఖ్యా భారీగా..

కొత్త జట్టును ఐపీఎల్-2021లో చేర్చితే.. మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఎనిమిది ఐపీఎల్ జట్లు 14 చొప్పున లీగ్ మ్యాచ్‌ల చొప్పున ఆడుతున్నాయి. కొత్త జట్టు చేరికతో దీని సంఖ్య 60 నుంచి 74కు చేరుకుంటుంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది బీసీసీఐకి. సమయం తక్కువగా ఉన్నందున.. ఈ సారి ఆ రిస్క్‌ను తీసుకోకూడదనే భావిస్తోంది బీసీసీఐ. అందుకే కొత్త ఫ్రాంఛైజీ కోసం దాఖలు చేయాల్సిన టెండర్ల ప్రక్రియను కాస్త ఆలస్యంగా చేపట్టడానికి కసరత్తు చేస్తోంది. దీపావళి తరువాతే కొత్త ఫ్రాంఛైజీ టెండర్లను ఆహ్వానిస్తుందని అంటున్నారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, November 12, 2020, 12:06 [IST]
Other articles published on Nov 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X