మరో కొత్త స్టార్‌కు జన్మనిచ్చిన ఐపీఎల్ ఫ్యాక్టరీ: రోహిత్ టీమ్ కొమ్ములు విరిచిన ఆర్డినరీ బౌలర్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ తొలి మ్యాచ్.. క్రికెట్ ప్రేమికుల అంచనాలకు అనుగుణంగా సాగింది. వారిని ఏ మాత్రం నిరాశ పర్చలేదు. ఫైనల్ బాల్ విక్టరీ.. ఈ లో-స్కోర్ మ్యాచ్‌లో హైలైట్. క్రికెట్ ఆరాధకులకు కావాల్సింది కూడా అదే. తక్కువ స్కోర్ నమోదైనప్పటికీ.. మ్యాచ్ చిట్టచివరి బంతి వరకూ సాగడం తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్టలోనూ బౌలర్లదే ఆధిపత్యం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టల్లో బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాట్స్‌మెన్లు పరుగులు తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.

కొత్త స్టార్..
సాధారణంగా- ప్రతి ఐపీఎల్ సీజన్‌లోనూ కొత్త క్రికెట్ స్టార్లు పుట్టుకొస్తుంటారు. అదే సంప్రదాయం ఈ సారి కూడా కొనసాగింది. తొలి మ్యాచ్‌లోనే స్టార్ బౌలర్ ఆవిర్భవించాడు. అతనే హర్షల్ పటేల్. 2012 నుంచీ అతను ఐపీఎల్ టోర్నమెంట్లలో ఆడుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరిన వేళా విశేషం ఏమిటో గానీ..ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే అతను అదరగొట్టాడు. అయిదు వికెట్లను సొంతం చేసుకున్నాడు. నాలుగు ఓవర్ల 27 పరుగులు ఇఛ్చి, ముంబై ఇండియన్స్ నడ్డి విరిచాడు. కీలక బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ దారి పట్టించాడు.

కట్టుదిట్టంగా బౌలింగ్..
చెన్నలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చిట్టచివరి బంతికి విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లను కోల్పోయి అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. స్కోర్‌బోర్డుపై తక్కువ పరుగులను నమోదు చేయగలిగిందంటే.. దానికి కారణం ఆర్సీబీ బౌలర్లే. మహ్మద్ సిరాజ్, కైలే జెమిసన్, హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగారు. డేనియల్ క్రిస్టియన్, యజువేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. ఈ ముగ్గురి బంతులను ముంబై బ్యాట్స్‌మెన్లు ఎదుర్కొనలేకపోయారు.

తొలి ఓవర్‌లో 15 పరుగులు..
ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ ఎలాంటి అంచనాలు లేకుండా బౌలింగ్‌కు దిగాడు. పొదుపు పరుగులు ఇచ్చుకుంటే సరిపోతుందనే భావన కేప్టెన్ విరాట్ కోహ్లీలో కనిపించింది. తొలి ఓవర్‌లో 15 పరుగులను అతను సమర్పించుకున్నాడు.. నో బాల్ సహా. పైగా ఫ్రీ హిట్‌ను ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ క్రిస్ లీన్.. సిక్సర్‌గా మలిచాడు. ఆ పరిస్థితుల్లో హర్షల్ పటేల్ బౌలింగ్‌కు దిగకపోవచ్చనే అనుకున్నారు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ హర్షల్ పటేల్ చెలరేగిపోయాడు.

2016 నుంచి 18 మ్యాచ్‌లే
2012 నుంచీ హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడుతున్నప్పటికీ.. పెద్దగా రాణించలేదు. 2016 నుంచి ఇప్పటిదాకా అతను ఆడింది 18 మ్యాచ్‌లే. ఆశించిన గుర్తింపు కూడా అతనికి దక్కలేదు. చెన్నై మ్యాచ్‌లో మాత్రం ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. హార్డ్ హిట్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్లను తన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో కట్టి పడేశాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించలేదు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొల్లార్డ్, కృనాల్ పాండ్యా వంటి పించ్ హిట్టర్లను పెవిలియన్ దారి పట్టించాడు. మార్కో జెన్‌సేన్‌ను అవుట్ చేయడంతో అయిదు వికెట్ల క్లబ్‌లో చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications