IPL 2021: ఓయ్ కోహ్లీ.. గల్వాన్ ఘటన మరిచిపోయావా? వివో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సిగ్గులేదు!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ ధనా ధన్ లీగ్‌కు తెరలేవనుంది. అయితే ఈ సారి ఈ మెగాలీగ్‌కు టైటిల్ స్పాన్సర్‌షిప్‌గా చైనా మొబైల్ కంపెనీ వివోనే వ్యవహరిస్తుంది.

వాస్తవానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం వివో బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. టైటిల్ స్పాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. అయితే గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.

టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11

టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11

దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌కు డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఇందుకోసం డ్రీమ్ 11 బీసీసీఐకి రూ.222 కోట్లు చెల్లించింది. ఇరుదేశాల మధ్య ఇప్పటికీ అవే పరిస్థితులు ఉండడం‌తో ఈ సీజన్ మొదట్లో వివోతో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంటుందనే ప్రచారం జరిగింది. కానీ జనాలు గల్వాన్ ఘటన మరిచిపోవడం, అప్పటిలా పెద్దగా విమర్శలు రాకపోవడంతో బీసీసీఐ ఒప్పందం ప్రకారం వివోతోనే ముందుకు సాగుతోంది. అంతేకాకుండా ఇటీవలే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ కంపెనీకి ప్రచారకర్తగా నియమితుడయ్యాడు.

వివో ప్రచారకర్తగా విరాట్..

ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఉన్న క్రేజ్‌ తమ ఉత్పత్తుల ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందని వివో వెల్లడించింది. టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివో సంస్థ పేర్కొంది. విరాట్ కోహ్లీ తన కాంట్రాక్ట్‌లో భాగంగా.. సంస్థకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నాడని కంపెనీ వివరించింది. దాంతో సోషల్ మీడియా వేదికగా విరాట్‌పై ఓ వర్గం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోహ్లీ.. సిగ్గుందా..?

చైనా కంపెనీ అయిన వివోకు ప్రచారకర్తగా ఉండేందుకు సిగ్గుందా? అని కోహ్లీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘గల్వాన్ ఘటన సమయంలో దేశభక్తి చాటిన నువ్వు.. ఏడాది తిరగకముందే జవాన్ల మరణాలు మరిచిపోయావా?'అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో కోహ్లీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసి మరి ప్రశ్నిస్తున్నారు. ఇంత మాత్రానికి గతేడాది ఎందుకు నిషేధించారని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ జనాలు కూడా ఏ విషయాన్ని ఎక్కువ రోజు గుర్తుంచుకోరని కామెంట్ చేస్తున్నారు.

తెలుగు జవాన్ వీరమరణం..

ఇండో-చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్‌లతో చైనా సైనికులు దాడి చేశారని అప్పట్లో ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈపోరులో తెలుగువాడైన ఒక కల్నల్‌తో పాటు 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు.

అప్పట్లో యావత్ భారతం చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రజలు కూడా జవాన్లకు మద్దుతుగా ఆ దేశ వస్తువులను స్వచ్చందంగా బహిష్కరించారు. ఇక భారత ప్రభుత్వం కూడా చైనాకు చెందిన పలు యాప్‌లను నిషేధించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 9, 2021, 15:14 [IST]
Other articles published on Apr 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X