KKR vs MI: రోహిత్ శర్మకు తృటిలో తప్పిన ప్రమాదం.. లేదంటే ఐపీఎల్ 2021 నుంచి ఔట్ అయ్యేవాడే!!

IPL 2021: Mumbai Indians skipper Rohit Sharma survives major injury while bowling in KKR match
#IPL2021, KKR vs MI : Rohit Sharma Survives Major Injury While Bowling During KKR || Oneindia

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రారంభం కాకముందే రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ గాయంతో దూరమయ్యాడు. ఇక లీగ్ ప్రారంభం అయి వారం కూడా కాకముందే ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వేలి గాయంతో దూరమాయ్యడు. దీంతో రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ముంబై ఇండియన్స్‌కు కూడా భారీ షాక్ తగిలేదే. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు కొద్దిపాటిలో ప్రమాదం తప్పింది. లేదంటే రోహిత్ కూడా ఐపీఎల్ 2021 నుంచి ఔట్ అయ్యేవాడు.

KKR vs MI: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆండ్రీ రసెల్‌.. 12 బంతుల్లోనే!!

బంతి వేసే క్రమంలో:

మంగళవారం చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. కోల్‌కతా ఇన్నింగ్స్ సందర్భంగా 14వ ఓవర్ రోహిత్ శర్మ వేశాడు. అయితే ఓవర్ మొదటి బంతి వేసే క్రమంలో రోహిత్ ఎడమ కాలికి చిన్నపాటి గాయమైంది. రనప్ తీసుకుంటుండగా.. రోహిత్ ఎడమ కాలు అదుపు తప్పింది. దీంతో చీలమండంకు గాయమైంది. వెంటనే నొప్పితో అతడు విలవిల్లాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వచ్చి రోహిత్ షూ విప్పి పరిశీలించారు. ముంబై మెడికల్ టీం వచ్చి చికిత్స చేసిన అనంతరం ఆ ఓవర్ పూర్తిచేశాడు.

ముంబై ఫాన్స్ ఆనందం:

ముంబై ఫాన్స్ ఆనందం:

చికిత్స అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సౌకర్యంగానే కనిపించాడు. మ్యాచులో ఓ ఓవర్ వేసిన రోహిత్.. 9 పరుగులు ఇచ్చాడు. రోహిత్ తన కాలు అదుపు తప్పుతున్నట్లు వెంటనే గ్రహించాడు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఐపీఎల్ 2021 నుంచి ఔట్ అయ్యేవాడే. రోహిత్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో ముంబై ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతాతో మ్యాచుకు ముందు ముంబై ప్రాక్టీస్‌ సెషన్‌లో రోహిత్ బౌలింగ్ సాధన చేశాడు. చెన్నై పిచ్‌ ఎక్కువగా స్పిన్‌కు సహరించడంతో పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గా రోహిత్‌ తన సేవలు జట్టుకు అందించాడు.

ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినా:

ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినా:

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన ఓ సరదా ట్వీట్.. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీని చిక్కుల్లో పడేసింది. రోహిత్ ఫిట్‌నెస్‌ను ఉద్దేశించి ట్రోల్ చేసేవారంతా అతన్ని వడాపావ్ అని పిలుస్తుంటారు. ముంబైలో పాపులర్ డిష్ అయిన వడాపావ్‌ను రోహిత్ ఎక్కువగా తింటాడని అందుకే అలా బొద్దుగా ఉంటాడని ఇప్పటికే ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. వడాపావ్ స్టాల్‌ దగ్గరకు రోహిత్ వెళ్లినట్లు ఎడిట్ చేసిన ఫొటోను ఓ యూజర్ తాజాగా ట్వీట్ చేశాడు. అదే ట్వీట్‌ను స్విగ్గీ షేర్ చేసింది. దీంతో అభిమానుల ఆగ్రహానికి గురైంది. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినా.. అప్పటికే స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.

రాహుల్‌ చహర్‌ మాయ:

రాహుల్‌ చహర్‌ మాయ:

స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ మాయ చేయడంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌ 2021లో బోణీ కొట్టింది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో కోల్‌కతా‌పై విజయం సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (56; 36 బంతుల్లో 7×4, 2×6), రోహిత్‌ శర్మ (43; 32 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో మొదట ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రసెల్‌ (5/15), కమిన్స్‌ (2/24) నిప్పులు చెరిగారు. ఛేదనలో నితీష్‌ రాణా (57; 47 బంతుల్లో 6×4, 2×6), శుభ్‌మన్‌ గిల్‌ (33; 24 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో కోల్‌కతా గెలిచేలా కనిపించింది. చహర్‌తో పాటు కృనాల్‌ (1/13), బౌల్ట్‌ (2/27), బుమ్రా (0/28) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోల్‌కతా 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 14, 2021, 8:19 [IST]
Other articles published on Apr 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X